వింతలేల సేసేవే విభుఁడు నీకు నితఁడు
(॥పల్లవి॥)
వింతలేల సేసేవే విభుఁడు నీకు నితఁడు
చెంత నీ మతి యాతనిచిత్తము గాదా
(॥వింత॥)
చిప్పిలమోవి ఇమ్మంటే సిగ్గువడ నేఁటికే
చొప్పున నిది యాతనిసొమ్ము గాదా
కొప్పు నీకుఁబెట్టేనంటే గొణఁగఁగ నేఁటికే
యెప్పుడూ నితనిసేస కిరవు గాదా
(॥వింత॥)
చన్నులు చూపుమంటేను జంకించనేఁటికే
పన్ని యీతనికి చేపట్లు గావా
పన్నీట నోలార్చేనంటే పలునవ్వులేఁటికే
అన్నిటా నీమేనితని కరడుతీగె గాదా
(॥వింత॥)
మొలనూలు వెట్టిరాఁగా మొక్కేవిదేఁటికే
పొలుపు శ్రీవేంకటేశు పొలముగాదా
అలరి నిన్నురమెక్కు మనఁగాఁ గొంకనేఁటికే
నెలఁత నీవే యతని నిండుసొమ్ముగాదా
(||pallavi||)
viṁtalela seseve vibhum̐ḍu nīgu nidam̐ḍu
sĕṁta nī madi yādanisittamu gādā
(||viṁta||)
sippilamovi immaṁṭe sigguvaḍa nem̐ṭige
sŏppuna nidi yādanisŏmmu gādā
kŏppu nīgum̐bĕṭṭenaṁṭe gŏṇam̐gam̐ga nem̐ṭige
yĕppuḍū nidanisesa kiravu gādā
(||viṁta||)
sannulu sūbumaṁṭenu jaṁkiṁchanem̐ṭige
panni yīdanigi sebaṭlu gāvā
pannīḍa nolārsenaṁṭe palunavvulem̐ṭige
anniḍā nīmenidani karaḍudīgĕ gādā
(||viṁta||)
mŏlanūlu vĕṭṭirām̐gā mŏkkevidem̐ṭige
pŏlubu śhrīveṁkaḍeśhu pŏlamugādā
alari ninnuramĕkku manam̐gām̐ gŏṁkanem̐ṭige
nĕlam̐ta nīve yadani niṁḍusŏmmugādā