Vimtaa nunnaamdu nee padi veenula pamdugagaanu

వింటా నున్నాఁడు నీ పతి వీనుల పండుగగాను
Language

(॥పల్లవి॥)
వింటా నున్నాఁడు నీ పతి వీనుల పండుగగాను
నంటున నీ విప్పుడే విన్నపము శాయఁగదే

(॥వింటా॥)
సొలపులమాటల సొంపులెల్ల మప్పతిలు
కలవుకోలుమాటలఁ గాక దేరును
అలుకదేరినమాట లాసలేఁటికిఁ బచారించేవే

(॥వింటా॥)
పలుమాట లేఁటికిఁ బచారించేవే
మచ్చికైనమాటల మనసెల్లాఁ గరఁగును
వచ్చిదేరేమాటలఁ బైకొనుఁ దమి
ముచ్చటమాటల మోహములు నిండుకొను
కొచ్చి వెడమాట లేల కుమ్మరించేవే

(॥వింటా॥)
కందువైన మాటలఁ గళలు రేఁగఁగ జేయు
పొందైనమాటలఁ బొడము నింపు
విందువలె నిన్ను శ్రీవేంకటేశుఁ డిదె కూడె
సందుసుడిమాట లేల చల్లఁ జూచేవే

(||pallavi||)
viṁṭā nunnām̐ḍu nī padi vīnula paṁḍugagānu
naṁṭuna nī vippuḍe vinnabamu śhāyam̐gade

(||viṁṭā||)
sŏlabulamāḍala sŏṁpulĕlla mappadilu
kalavugolumāḍalam̐ gāga derunu
alugaderinamāḍa lāsalem̐ṭigim̐ basāriṁcheve

(||viṁṭā||)
palumāḍa lem̐ṭigim̐ basāriṁcheve
machchigainamāḍala manasĕllām̐ garam̐gunu
vachchideremāḍalam̐ baigŏnum̐ dami
muchchaḍamāḍala mohamulu niṁḍugŏnu
kŏchchi vĕḍamāḍa lela kummariṁcheve

(||viṁṭā||)
kaṁduvaina māḍalam̐ gaḽalu rem̐gam̐ga jeyu
pŏṁdainamāḍalam̐ bŏḍamu niṁpu
viṁduvalĕ ninnu śhrīveṁkaḍeśhum̐ ḍidĕ kūḍĕ
saṁdusuḍimāḍa lela sallam̐ jūseve