వింత వింత మాట లివి వింటిమి నేము
(॥పల్లవి॥)
వింత వింత మాట లివి వింటిమి నేము
పంతగాఁడ వింతేసి భ్రమతురా వోయి
(॥వింత॥)
నడుమ నెవ్వతోఁజూచి నావలె నున్నది యంటా
బడిఁ దిరిగితి వట బాపురే నీవు
అడరి నాపేరఁ బిల్చిఆవెకొంగు వట్టి తేను
కడు నవ్వె నట నిన్నుఁ గద్దా వోయి
(॥వింత॥)
నిద్దరింపుచున్న యాడో నెలఁత నే నంటాఁ జూచి
వొద్దఁ బండుండితి వట వోహో నీవు
సుద్దులు నాతోవలె సూచించి చన్నులంటి
అద్దలించి మెచ్చె నట అవునా వోయి
(॥వింత॥)
నిలువుటద్దములో నా నీడ చూచి నే నంటా
అలరి పై కొంటివట అవురా నీవు
యెలమి శ్రీవేంకటేశ యిట్టే న న్నేలితివి
యిల నాపెఁ గూడెనట యితవా వోయి
(||pallavi||)
viṁta viṁta māḍa livi viṁṭimi nemu
paṁtagām̐ḍa viṁtesi bhramadurā voyi
(||viṁta||)
naḍuma nĕvvadom̐jūsi nāvalĕ nunnadi yaṁṭā
baḍim̐ dirigidi vaḍa bābure nīvu
aḍari nāberam̐ bilsiāvĕgŏṁgu vaṭṭi tenu
kaḍu navvĕ naḍa ninnum̐ gaddā voyi
(||viṁta||)
niddariṁpusunna yāḍo nĕlam̐ta ne naṁṭām̐ jūsi
vŏddam̐ baṁḍuṁḍidi vaḍa voho nīvu
suddulu nādovalĕ sūsiṁchi sannulaṁṭi
addaliṁchi mĕchchĕ naḍa avunā voyi
(||viṁta||)
niluvuḍaddamulo nā nīḍa sūsi ne naṁṭā
alari pai kŏṁṭivaḍa avurā nīvu
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭe na nnelidivi
yila nābĕm̐ gūḍĕnaḍa yidavā voyi