Vimta vimta baagulellaa velaya neevalla gamti

వింత వింత బాగులెల్లా వెలయ నీవల్ల గంటి
Language

(॥పల్లవి॥)
వింత వింత బాగులెల్లా వెలయ నీవల్ల గంటి
అంతరంగములు నీతో నానతియ్యవయ్యా

(॥వింత॥)
తలఁపునఁ బారెనో యే తరుణి నీకేమైనా
కలలోన వచ్చేనోకాక యేమైనా
పలుకున నాపేరు పక్కునఁ దొరలెనో
చెలఁగి నా మోము చూచి సిగ్గువడేవు

(॥వింత॥)
కన్నులఁ గన్నట్టాయనో కామించినయాపె చూపు
విన్నట్టె వుండెనో నీ కీవేళ నా మాఁట
చిన్ని మోవితేనెకు మచ్చికల నోరూరెనో
నన్నుఁ జూచి నిలువునే నవ్వుకొనేవు

(॥వింత॥)
కాఁగిట నిట్టె తోఁచెనో కడల మున్నిటిరతి
లోఁగిటనే వున్నదో పోలుచ నీపొందు
చేఁగదేరఁ గూడితివి శ్రీవేంకటేశ నన్ను
వీఁగక నావంక చూచి వెరగు నొందేవు

(||pallavi||)
viṁta viṁta bāgulĕllā vĕlaya nīvalla gaṁṭi
aṁtaraṁgamulu nīdo nānadiyyavayyā

(||viṁta||)
talam̐punam̐ bārĕno ye taruṇi nīgemainā
kalalona vachchenogāga yemainā
paluguna nāberu pakkunam̐ dŏralĕno
sĕlam̐gi nā momu sūsi sigguvaḍevu

(||viṁta||)
kannulam̐ gannaṭṭāyano kāmiṁchinayābĕ sūbu
vinnaṭṭĕ vuṁḍĕno nī kīveḽa nā mām̐ṭa
sinni movidenĕgu machchigala norūrĕno
nannum̐ jūsi niluvune navvugŏnevu

(||viṁta||)
kām̐giḍa niṭṭĕ tom̐sĕno kaḍala munniḍiradi
lom̐giḍane vunnado polusa nībŏṁdu
sem̐gaderam̐ gūḍidivi śhrīveṁkaḍeśha nannu
vīm̐gaga nāvaṁka sūsi vĕragu nŏṁdevu