వింత నీతనిఁ జూడవే వేడుకయ్యీని
(॥పల్లవి॥)
వింత నీతనిఁ జూడవే వేడుకయ్యీని
యెంతైనాఁ దన మేని యెమ్మె చూపీనిపుడే
(॥వింత॥)
చెలువునితోఁ బెనఁగి సేసకొప్పు వంచుకువే
కొలువులో శింగారించుకొనెనిప్పుడే
కలువ పూవులు వేసి కపురు మాయించకువే
పొలసి గందపుఁబూత పూసినాఁడిపుడే
(॥వింత॥)
నాయకుని పచ్చడము నలఁగఁ దొక్కకువే
వేయరాని వల్లెవాటు వేసెనిప్పుడే
చేయిచాఁచి హారములు చిక్కులు వరచుకువే
కాయకముగా నతఁడు కట్టుకొనెనిపుడే
(॥వింత॥)
శ్రీ వేంకటేశ్వరుని సిగ్గులు వరచకువే
కోవిదుఁడై నిన్నుఁదానే కూడె నిపుడు(డే?)
వావిరిఁ గెమ్మోవెల్ల వాడఁగఁ బీరుచకువే
చేవదేర విడేలు సేసినాఁడిపుడే
(||pallavi||)
viṁta nīdanim̐ jūḍave veḍugayyīni
yĕṁtainām̐ dana meni yĕmmĕ sūbīnibuḍe
(||viṁta||)
sĕluvunidom̐ bĕnam̐gi sesagŏppu vaṁchuguve
kŏluvulo śhiṁgāriṁchugŏnĕnippuḍe
kaluva pūvulu vesi kaburu māyiṁchaguve
pŏlasi gaṁdabum̐būda pūsinām̐ḍibuḍe
(||viṁta||)
nāyaguni pachchaḍamu nalam̐gam̐ dŏkkaguve
veyarāni vallĕvāḍu vesĕnippuḍe
seyisām̐si hāramulu sikkulu varasuguve
kāyagamugā nadam̐ḍu kaṭṭugŏnĕnibuḍe
(||viṁta||)
śhrī veṁkaḍeśhvaruni siggulu varasaguve
kovidum̐ḍai ninnum̐dāne kūḍĕ nibuḍu(ḍe?)
vāvirim̐ gĕmmovĕlla vāḍam̐gam̐ bīrusaguve
sevadera viḍelu sesinām̐ḍibuḍe