Vimdamu dana suddulu vegira mele

విందము దన సుద్దులు వేగిర మేలే
Language

(॥పల్లవి॥)
విందము దన సుద్దులు వేగిర మేలే
అందికలుఁ బొందికలు అణఁగీనా యిఁకను

(॥వింద॥)
నాననీవే వలపులు నవ్వితేనెందు వొయ్యీని
తానే వచ్చీఁ గాక తరవేఁటికి
కానీలేవే అందుకేమి కడురతులఁ దనిసి
మానుపడి వున్నాఁడేమో మరచీనా నన్నును

(॥వింద॥)
పెంచనీవే గర్వములు బిగిసితేనేమాయ
వంచుకొనేఁ గాక మీరు వద్దననేలే
కొంచక సతులలోనఁ గొలువై వుండినవేళ
మించినపరాకేమో మీమాట వినఁడా

(॥వింద॥)
సేయనీవే తరితీపు చెనకితేనేమాయ
యీయెడ నేనుండేఁ గాక యీరసాలేలే
వేయిటికి శ్రీవేంకటేశుఁడిదె కూడె
పాయపు వినోదమేమో బాఁతయ్యీననేను

(||pallavi||)
viṁdamu dana suddulu vegira mele
aṁdigalum̐ bŏṁdigalu aṇam̐gīnā yim̐kanu

(||viṁda||)
nānanīve valabulu navvidenĕṁdu vŏyyīni
tāne vachchīm̐ gāga taravem̐ṭigi
kānīleve aṁdugemi kaḍuradulam̐ danisi
mānubaḍi vunnām̐ḍemo marasīnā nannunu

(||viṁda||)
pĕṁchanīve garvamulu bigisidenemāya
vaṁchugŏnem̐ gāga mīru vaddananele
kŏṁchaga sadulalonam̐ gŏluvai vuṁḍinaveḽa
miṁchinabarāgemo mīmāḍa vinam̐ḍā

(||viṁda||)
seyanīve taridību sĕnagidenemāya
yīyĕḍa nenuṁḍem̐ gāga yīrasālele
veyiḍigi śhrīveṁkaḍeśhum̐ḍidĕ kūḍĕ
pāyabu vinodamemo bām̐tayyīnanenu