విడువు వేసాలు పదివేలు వచ్చెను
(॥పల్లవి॥)
విడువు వేసాలు పదివేలు వచ్చెను
తడవకువయ్యా నీ తలఁపెల్లా గంటిమి
(॥॥)
వెక్కసపు విరహన వేఁగినచెలి విభుఁడు
చెక్కునొక్కినంతలోనె చెంగలించును
ఇక్కువ ఇదెరిఁగే కాయేమిటికీ వెరవవు
చక్కనుండవయ్య ఈ జాడలెల్లఁ గంటిమి
(॥॥)
మదనబాణాలచేత మాఁగినట్టి చెలిఁ బతి
కదిసి చన్నులంటితేఁ గళ రేఁగును
యిది నేర్చుకొని కానీవింత తక్కరించేవు
వుదుటు చూపుకువయ్య వోజలెల్లాఁ గంటిమి
(॥॥)
అడియాసచేతను అలసినాకె రమణుఁ
డొడఁబరచి కూడితే నొద్దికౌను
గడుసవై కా శ్రీవేంకటేశ నన్నేలితివి
విడువకువయ్యా నీవిధమెల్లా గంటిమి.
(||pallavi||)
viḍuvu vesālu padivelu vachchĕnu
taḍavaguvayyā nī talam̐pĕllā gaṁṭimi
(||||)
vĕkkasabu virahana vem̐ginasĕli vibhum̐ḍu
sĕkkunŏkkinaṁtalonĕ sĕṁgaliṁchunu
ikkuva idĕrim̐ge kāyemiḍigī vĕravavu
sakkanuṁḍavayya ī jāḍalĕllam̐ gaṁṭimi
(||||)
madanabāṇālaseda mām̐ginaṭṭi sĕlim̐ badi
kadisi sannulaṁṭidem̐ gaḽa rem̐gunu
yidi nersugŏni kānīviṁta takkariṁchevu
vuduḍu sūbuguvayya vojalĕllām̐ gaṁṭimi
(||||)
aḍiyāsasedanu alasināgĕ ramaṇum̐
ḍŏḍam̐barasi kūḍide nŏddigaunu
gaḍusavai kā śhrīveṁkaḍeśha nannelidivi
viḍuvaguvayyā nīvidhamĕllā gaṁṭimi.