విడువరా దెంతైనా వెఱ్ఱివాఁడనైన నీకు
(॥పల్లవి॥)
విడువరా దెంతైనా వెఱ్ఱివాఁడనైన నీకు
కడవారు నవ్వకుండాఁ గాచుకో నన్నును
(॥విడు॥)
జ్ఞానము నే నెఱఁగ నజ్ఞానముఁ నే నెఱఁగను
మానను విషయములు మరిగెంతైనా
నీనామము నొడిగి నాదాసుఁడ ననుకొందు
దీనికే వహించుకొని తిద్దుకో నన్నును
(॥విడు॥)
అకర్మము నెఱఁగను సుకర్మము నెఱఁగను
ప్రకటసంసారముపై పాటు మానను
వొకపనివాఁడనై వూని ముద్రధారినైతి
మొకమోడి యిందుకే గోమున నేలు నన్నును
(॥విడు॥)
వెనకఁ గానను ముందు విచారించి కానను
నినుపై దేహధారినై నీకు మొక్కేను
ఘనుఁడ శ్రీవేంకటేశ కన్నులెదుటఁ బడితి
కని పోవిడువరాదు కరుణించు నన్నును
(||pallavi||)
viḍuvarā dĕṁtainā vĕṭrivām̐ḍanaina nīgu
kaḍavāru navvaguṁḍām̐ gāsugo nannunu
(||viḍu||)
jñānamu ne nĕṟam̐ga najñānamum̐ ne nĕṟam̐ganu
mānanu viṣhayamulu marigĕṁtainā
nīnāmamu nŏḍigi nādāsum̐ḍa nanugŏṁdu
dīnige vahiṁchugŏni tiddugo nannunu
(||viḍu||)
agarmamu nĕṟam̐ganu sugarmamu nĕṟam̐ganu
pragaḍasaṁsāramubai pāḍu mānanu
vŏgabanivām̐ḍanai vūni mudradhārinaidi
mŏgamoḍi yiṁduge gomuna nelu nannunu
(||viḍu||)
vĕnagam̐ gānanu muṁdu visāriṁchi kānanu
ninubai dehadhārinai nīgu mŏkkenu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kannulĕduḍam̐ baḍidi
kani poviḍuvarādu karuṇiṁchu nannunu