విడువదు తన్ను విడువఁ జూచిన తన్ను
(॥పల్లవి॥)
విడువదు తన్ను విడువఁ జూచిన తన్ను
విడిచినఁ గాని విడువ దెన్నఁడును
(॥విడువదు॥)
మానని పుంటికి మందు మంతరము లేని సంది
గోనెఁ బట్టినట్టి బంక గోడమీఁది మన్ను
జ్ఞానము లేని యెఱుక సందుగిందు లేని యిల్లు
రానిపోనిచోటి రాజులేని కొలువు
(॥విడువదు॥)
చిత్తములోపలివాఁడు చిత్తములవెలివాఁడు
చిత్తము మేన గూడఁ జేసినవాఁడు
చిత్తజజనకుఁడైన శ్రీవేంకటాద్రీశుఁడు మద
మెత్తినమోహముఁ దన్ను నెడ ఇయ్యఁడైనా
(||pallavi||)
viḍuvadu tannu viḍuvam̐ jūsina tannu
viḍisinam̐ gāni viḍuva dĕnnam̐ḍunu
(||viḍuvadu||)
mānani puṁṭigi maṁdu maṁtaramu leni saṁdi
gonĕm̐ baṭṭinaṭṭi baṁka goḍamīm̐di mannu
jñānamu leni yĕṟuga saṁdugiṁdu leni yillu
rānibonisoḍi rājuleni kŏluvu
(||viḍuvadu||)
sittamulobalivām̐ḍu sittamulavĕlivām̐ḍu
sittamu mena gūḍam̐ jesinavām̐ḍu
sittajajanagum̐ḍaina śhrīveṁkaḍādrīśhum̐ḍu mada
mĕttinamohamum̐ dannu nĕḍa iyyam̐ḍainā