Viduva viduva nimka vishnumda neebaadamulu

విడువ విడువ నింక విష్ణుఁడ నీపాదములు
Language

(॥పల్లవి॥)
విడువ విడువ నింక విష్ణుఁడ నీపాదములు
కడఁగి సంసారవార్ధి కడు ముంచుకొనిన

(॥విడు॥)
పరమాత్మ నీవెందో పరాకైయున్నాను
పరగ నన్నింద్రియాలు పరచినాను
ధరణిపైఁ జెలరేఁగి తనువు వేసరినాను
దురితాలు నలువంకఁ దొడికి తీసినను

(॥విడు॥)
పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ
వట్టి ముదిమైన రానీ వయసే రానీ
చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుఁ బోదు

(॥విడు॥)
యీదేహమే యయిన ఇఁక నొకటైనాను
కాదు గూడదని ముక్తి కడకేఁగినా
శ్రీదేవుఁడవైన శ్రీవేంకటేశ నీకు
సోదించి నీశరణమె చొచ్చితి నే నిఁకను

(||pallavi||)
viḍuva viḍuva niṁka viṣhṇum̐ḍa nībādamulu
kaḍam̐gi saṁsāravārdhi kaḍu muṁchugŏnina

(||viḍu||)
paramātma nīvĕṁdo parāgaiyunnānu
paraga nanniṁdriyālu parasinānu
dharaṇibaim̐ jĕlarem̐gi tanuvu vesarinānu
duridālu naluvaṁkam̐ dŏḍigi tīsinanu

(||viḍu||)
puṭṭugu liṭṭĕ rānī bhuvi lega mānanī
vaṭṭi mudimaina rānī vayase rānī
suṭṭugŏnnabaṁdhamulu sūḍanī vīḍanī
nĕṭṭugŏnnayaṁtarātma nīgu nāgum̐ bodu

(||viḍu||)
yīdehame yayina im̐ka nŏgaḍainānu
kādu gūḍadani mukti kaḍagem̐ginā
śhrīdevum̐ḍavaina śhrīveṁkaḍeśha nīgu
sodiṁchi nīśharaṇamĕ sŏchchidi ne nim̐kanu