Viduruni vimdaa vijayeebhava

విదురుని విందా విజయీభవ
Language

(॥పల్లవి॥)
విదురుని విందా విజయీభవ
హృదయేశ్వర విజయీభవ

(॥విదురుని॥)
దైవశిఖామణి దానవమర్ధన
వేవేలకు నీకు విజయీభవ
శ్రీ వల్లభగుణ చింతాసాగర
యీవల నిదె విజయీ భవ

(॥విదురుని॥)
జగదేకవిభుఁడ శతమఖవందిత
వెగటు విజయముల విజయీ భవ
నిగమవినుత సర్వనిలయ నారాయణ
యిగిరించెఁ గృప విజయీ భవ

(॥విదురుని॥)
జలధిమధన సర్వజంతువిహారక
వెలసె నీ మహిమలు విజయీ భవ
కలిత శ్రీ వేంకట కామితవరద నిత్య
యిలధర నీకు విజయీ భవ

(||pallavi||)
viduruni viṁdā vijayībhava
hṛdayeśhvara vijayībhava

(||viduruni||)
daivaśhikhāmaṇi dānavamardhana
vevelagu nīgu vijayībhava
śhrī vallabhaguṇa siṁtāsāgara
yīvala nidĕ vijayī bhava

(||viduruni||)
jagadegavibhum̐ḍa śhadamakhavaṁdida
vĕgaḍu vijayamula vijayī bhava
nigamavinuda sarvanilaya nārāyaṇa
yigiriṁchĕm̐ gṛpa vijayī bhava

(||viduruni||)
jaladhimadhana sarvajaṁtuvihāraga
vĕlasĕ nī mahimalu vijayī bhava
kalida śhrī veṁkaḍa kāmidavarada nitya
yiladhara nīgu vijayī bhava