విడు విడు యీ సుద్ది విననోపా
(॥పల్లవి॥)
విడు విడు యీ సుద్ది విననోపా
యెడపుల ఆస లివేఁటి కయ్యా
(॥విడు॥)
మగువమాట లివి మంత్రరాజములు
తగిలి నీవెట్ల దాఁటేవు
నగి నగి మాతో ననుపులు సేసేవు
యెగసక్కెము లివి యేఁటికయ్యా
(॥విడు॥)
పొలిఁతియి ల్లదియె పుణ్యక్షేత్ర ము
వెలుపలి కెటువలె వెడలేవు
చలమున మాతో సరసములాడేవు
యెలయింపులు మరి యేఁటికయ్యా
(॥విడు॥)
కాంత కాఁగిలే కామనిధానము
వింతపొం దెట్ల వెదకేవు
యింతట శ్రీవేంకటేశ ననుఁ గూడితిఁ
వింతేసివినయము లేఁటికయ్యా
(||pallavi||)
viḍu viḍu yī suddi vinanobā
yĕḍabula āsa livem̐ṭi kayyā
(||viḍu||)
maguvamāḍa livi maṁtrarājamulu
tagili nīvĕṭla dām̐ṭevu
nagi nagi mādo nanubulu sesevu
yĕgasakkĕmu livi yem̐ṭigayyā
(||viḍu||)
pŏlim̐tiyi lladiyĕ puṇyakṣhetra mu
vĕlubali kĕḍuvalĕ vĕḍalevu
salamuna mādo sarasamulāḍevu
yĕlayiṁpulu mari yem̐ṭigayyā
(||viḍu||)
kāṁta kām̐gile kāmanidhānamu
viṁtabŏṁ dĕṭla vĕdagevu
yiṁtaḍa śhrīveṁkaḍeśha nanum̐ gūḍidim̐
viṁtesivinayamu lem̐ṭigayyā