Vidhinishedhamulagu veṟavamgam baniledu

విధినిషేధములకు వెఱవఁగఁ బనిలేదు
Language

(॥పల్లవి॥)
విధినిషేధములకు వెఱవఁగఁ బనిలేదు
మధుసూదన నీమన్నన దాసుఁడైతే

(॥విధి॥)
విడువరానిధర్మ విధుల పురుషులను
విడిచి గోపికలు విచ్చనవిడి
బడి నిన్ను దగులుటే పరమధర్మ మాయ
యెడయునితర ధర్మాలిక నేటికయ్యా

(॥విధి॥)
మానరాని కర్మమార్గము లటు మాని
పూనినయతులే పూజ్యులట
నీనారాయణనియతే ధర్మమాయ
యీనిజ మొకటియు నెఱగఁగఁవలయు

(॥విది॥)
యిన్నిట శ్రీవేంకటేశ నీదాసుఁడై
వున్న విచారాల నొదుగనేలా
నిన్ను గూర్చినట్టి నిజభ క్తి గలదని
తిన్ననై తెలిపేటి తెలివే కలది

(||pallavi||)
vidhiniṣhedhamulagu vĕṟavam̐gam̐ baniledu
madhusūdana nīmannana dāsum̐ḍaide

(||vidhi||)
viḍuvarānidharma vidhula puruṣhulanu
viḍisi gobigalu vichchanaviḍi
baḍi ninnu daguluḍe paramadharma māya
yĕḍayunidara dharmāliga neḍigayyā

(||vidhi||)
mānarāni karmamārgamu laḍu māni
pūninayadule pūjyulaḍa
nīnārāyaṇaniyade dharmamāya
yīnija mŏgaḍiyu nĕṟagam̐gam̐valayu

(||vidi||)
yinniḍa śhrīveṁkaḍeśha nīdāsum̐ḍai
vunna visārāla nŏduganelā
ninnu gūrsinaṭṭi nijabha kti galadani
tinnanai tĕlibeḍi tĕlive kaladi