విడె మందుకొనవయ్య వెస నంది యిచ్చీని
(॥పల్లవి॥)
విడె మందుకొనవయ్య వెస నంది యిచ్చీని
విడనాడ నున్న దావెలఁది యెడాటాన
(॥విడె॥)
సలిగె గలుగువారు సాదించ దొరకొంటే
కొలఁది మీరుదురు కోపగింతురు
కలసి మెలసి నట్టి ఘనుఁడవు నీవింత
చలపట్టనున్నదా సతియెడాటాన
(॥విడె॥)
ననుపు గలుగువారు నవ్వు నవ్వ దొరకొంటే
తనువులు సోఁకింతురు తమి రేఁతురు
చన విచ్చినటువంటి జాణఁడవు నీవింత
పెనఁగఁగ నున్నదా ప్రియురాలెడాటాన
(॥విడె॥)
తగవులు గలుగువారు తమకించ దొరకొంటే
పగటు నెరపుదురు పచారింతురు
మగువఁ గూడితివి నెమ్మది శ్రీ వేంకటేశుఁడ
అగడు సేయనున్నదా అంగనయడాటాన
(||pallavi||)
viḍĕ maṁdugŏnavayya vĕsa naṁdi yichchīni
viḍanāḍa nunna dāvĕlam̐di yĕḍāḍāna
(||viḍĕ||)
saligĕ galuguvāru sādiṁcha dŏragŏṁṭe
kŏlam̐di mīruduru kobagiṁturu
kalasi mĕlasi naṭṭi ghanum̐ḍavu nīviṁta
salabaṭṭanunnadā sadiyĕḍāḍāna
(||viḍĕ||)
nanubu galuguvāru navvu navva dŏragŏṁṭe
tanuvulu som̐kiṁturu tami rem̐turu
sana vichchinaḍuvaṁṭi jāṇam̐ḍavu nīviṁta
pĕnam̐gam̐ga nunnadā priyurālĕḍāḍāna
(||viḍĕ||)
tagavulu galuguvāru tamagiṁcha dŏragŏṁṭe
pagaḍu nĕrabuduru pasāriṁturu
maguvam̐ gūḍidivi nĕmmadi śhrī veṁkaḍeśhum̐ḍa
agaḍu seyanunnadā aṁganayaḍāḍāna