Vichchi sepparaadu vimtalu yee bhaavaalu

విచ్చి చెప్పరాదు వింతలు యీ భావాలు
Language

(॥పల్లవి॥)
విచ్చి చెప్పరాదు వింతలు యీ భావాలు
రచ్చలకెక్కెను అంత రవ్వసేయనేఁటికి

(॥విచ్చి॥)
వలపులలోనివే వడిగొన్న యాసలెల్ల
సెలవులలోనివే సిగ్గులేల్లాను
పిలుపులలోనివే ప్రియములుగలవెల్లా
కులికి కులికి యేలే కొసరేవు వతిని

(॥విచ్చి॥)
చనవులలోనివే సరసములెల్లాను
ననుపులలోనివే నయములెల్లా
మనసులలోనివే మచ్చికలుగలవెల్లా
వొనర నింకానేలే వొరసేవు పతిని

(॥విచ్చి॥)
నమ్మికలలోనివే నానాఁటివొడఁబాటు
వుమ్మడివయసులోనే వొద్దికలెల్లా
నెమ్మదిఁ గూడె నతఁడు నిన్ను నట్టె బుజ్జగించి
చిమ్మకువే గోళ్లను శ్రీవేంకటపతిని

(||pallavi||)
vichchi sĕpparādu viṁtalu yī bhāvālu
rachchalagĕkkĕnu aṁta ravvaseyanem̐ṭigi

(||vichchi||)
valabulalonive vaḍigŏnna yāsalĕlla
sĕlavulalonive siggulellānu
pilubulalonive priyamulugalavĕllā
kuligi kuligi yele kŏsarevu vadini

(||vichchi||)
sanavulalonive sarasamulĕllānu
nanubulalonive nayamulĕllā
manasulalonive machchigalugalavĕllā
vŏnara niṁkānele vŏrasevu padini

(||vichchi||)
nammigalalonive nānām̐ṭivŏḍam̐bāḍu
vummaḍivayasulone vŏddigalĕllā
nĕmmadim̐ gūḍĕ nadam̐ḍu ninnu naṭṭĕ bujjagiṁchi
simmaguve goḽlanu śhrīveṁkaḍabadini