Vichcheyumanamgade vibhunim jeligadagu

విచ్చేయుమనఁగదే విభునిఁ జెలికడకు
Language

(॥పల్లవి॥)
విచ్చేయుమనఁగదే విభునిఁ జెలికడకు
పచ్చిసిగ్గు నెన్నడుమ బట్టబయలాయను

(॥॥)
కోరికలు కొనసాగి కోమలికిఁ గొప్పుగూడె
మేరతోఁ గళలె ముంచె మించుఁబాయము
పేరడైనవలపెల్లాఁ బెదవులఁ జిగిరించె
ఆరయ నంగన నేఁటి కాఱడఁబెట్టీనె

(॥॥)
సతితమకములెల్లా చనుఁగొండలై పెరిగె
రతికాంక్ష పిఱుఁదున రాసెకెక్కెను
మతిలోనివిరహము మంచినిట్టూర్పుల రేఁగె
మతకమేఁటికిఁ జేసి మానినితోఁ దాను

(॥॥)
కూడేటిసంతసములు కొనగోళ్ళైవాండ్లెక్కె
పాడితోఁ గోమలికము పాదాల నిండె
యీడ నలమేలుమంగ నెనసె శ్రీవేంకటేశుఁ-
డాడినట్టే సేసె నింతి నట్టె దినదినము

(||pallavi||)
vichcheyumanam̐gade vibhunim̐ jĕligaḍagu
pachchisiggu nĕnnaḍuma baṭṭabayalāyanu

(||||)
korigalu kŏnasāgi komaligim̐ gŏppugūḍĕ
meradom̐ gaḽalĕ muṁchĕ miṁchum̐bāyamu
peraḍainavalabĕllām̐ bĕdavulam̐ jigiriṁchĕ
āraya naṁgana nem̐ṭi kāṟaḍam̐bĕṭṭīnĕ

(||||)
sadidamagamulĕllā sanum̐gŏṁḍalai pĕrigĕ
radigāṁkṣha piṟum̐duna rāsĕgĕkkĕnu
madilonivirahamu maṁchiniṭṭūrbula rem̐gĕ
madagamem̐ṭigim̐ jesi māninidom̐ dānu

(||||)
kūḍeḍisaṁtasamulu kŏnagoḽḽaivāṁḍlĕkkĕ
pāḍidom̐ gomaligamu pādāla niṁḍĕ
yīḍa nalamelumaṁga nĕnasĕ śhrīveṁkaḍeśhum̐-
ḍāḍinaṭṭe sesĕ niṁti naṭṭĕ dinadinamu