Vichcheyu maayimti kitte vimtavaamdavaa

విచ్చేయు మాయింటి కిట్టె వింతవాఁడవా
Language

(॥పల్లవి॥)
విచ్చేయు మాయింటి కిట్టె వింతవాఁడవా
పచ్చిదేరెఁ బను లెల్ల పైపై నీవల్లనే

(॥విచ్చేయు॥)
యిచ్చక మై యుండేవాడ వెగ్గు లేల పట్టేవు
నచ్చుల నే తిట్టినాను నవ్వవలెఁ బో
చెచ్చెర నా కెల వలచితి నని యందువు
యెచ్చు కుందు లాయ మాట యిదివో నీ వల్లనే

(॥విచ్చేయు॥)
చుట్టము వైనాఁడవు సోలి చిన్నఁ బో నేల
అట్టె నే రాకు మనిన నంటవలెఁ బో
దట్టముగ నాకుఁగా వ్రతము వట్టితి నందువు
వెట్టిపొందు లెల్లాను వెలసె నీవల్లనే

(॥విచ్చేయు॥)
తగులు గలవాఁడవు తడఁబాటు లిఁక నేల
మొగము నేఁ జూచిలేను మొక్కవలెఁ బో
నిగిడి శ్రీవెంకటేశ నీవు నేనుఁ గూడితిమి
తెగనిమహిమ లెల్లఁ దెలినె నీవల్లనే

(||pallavi||)
vichcheyu māyiṁṭi kiṭṭĕ viṁtavām̐ḍavā
pachchiderĕm̐ banu lĕlla paibai nīvallane

(||vichcheyu||)
yichchaga mai yuṁḍevāḍa vĕggu lela paṭṭevu
nachchula ne tiṭṭinānu navvavalĕm̐ bo
sĕchchĕra nā kĕla valasidi nani yaṁduvu
yĕchchu kuṁdu lāya māḍa yidivo nī vallane

(||vichcheyu||)
suṭṭamu vainām̐ḍavu soli sinnam̐ bo nela
aṭṭĕ ne rāgu manina naṁṭavalĕm̐ bo
daṭṭamuga nāgum̐gā vradamu vaṭṭidi naṁduvu
vĕṭṭibŏṁdu lĕllānu vĕlasĕ nīvallane

(||vichcheyu||)
tagulu galavām̐ḍavu taḍam̐bāḍu lim̐ka nela
mŏgamu nem̐ jūsilenu mŏkkavalĕm̐ bo
nigiḍi śhrīvĕṁkaḍeśha nīvu nenum̐ gūḍidimi
tĕganimahima lĕllam̐ dĕlinĕ nīvallane