విచ్చేయవయ్యా వేఁగుదాఁకా జాగు లేల
(॥పల్లవి॥)
విచ్చేయవయ్యా వేఁగుదాఁకా జాగు లేల
కొచ్చి చెలులము నేము కొండేలు చెప్పేమా
(॥విచ్చే॥)
ఈకడ నన్నే మడిగే వింటికి విచ్చేసితేను
ఆకెచేతనే వినేవు అప్పుడు నీవు
జోక నిన్నేఁటికో పిలుచుకొని రమ్మనఁగాను
దాకొని వచ్చితి నింతే తలఁ పెరుఁగుదునా
(॥విచ్చే॥)
ఆన లేఁటికిఁ బెట్టేవు అండకు నీ వేఁగితేను
కానఁబగీ నన్నియును కాంతవల్లనే
తానె నీ వేడ నున్నా వెదకి తోడి తెమ్మనఁగ
మోనాన వచ్చితి నింతే ముంద రెరుఁగుదునా
(॥విచ్చే॥)
కరికరఁ బెట్ట నేల కాంత నీవుఁ గూడితేను
అరయఁగ మంచి వయ్యీ నన్ని పనులు
యిరవై శ్రీవెంకటేశ యింతివద్దఁ గూచుంటివి
సరసా లాడఁగాఁ గంటి సర వెరుఁగుదునా
(||pallavi||)
vichcheyavayyā vem̐gudām̐kā jāgu lela
kŏchchi sĕlulamu nemu kŏṁḍelu sĕppemā
(||vichche||)
īgaḍa nanne maḍige viṁṭigi vichchesidenu
āgĕsedane vinevu appuḍu nīvu
joga ninnem̐ṭigo pilusugŏni rammanam̐gānu
dāgŏni vachchidi niṁte talam̐ pĕrum̐gudunā
(||vichche||)
āna lem̐ṭigim̐ bĕṭṭevu aṁḍagu nī vem̐gidenu
kānam̐bagī nanniyunu kāṁtavallane
tānĕ nī veḍa nunnā vĕdagi toḍi tĕmmanam̐ga
monāna vachchidi niṁte muṁda rĕrum̐gudunā
(||vichche||)
karigaram̐ bĕṭṭa nela kāṁta nīvum̐ gūḍidenu
arayam̐ga maṁchi vayyī nanni panulu
yiravai śhrīvĕṁkaḍeśha yiṁtivaddam̐ gūsuṁṭivi
sarasā lāḍam̐gām̐ gaṁṭi sara vĕrum̐gudunā