విచ్చేయవయ్యా వెలఁదిఁ జూతువు గాని
(॥పల్లవి॥)
విచ్చేయవయ్యా వెలఁదిఁ జూతువు గాని
ఇచ్చకములాడేము యెట్టయినాఁ గాని
(॥॥)
మరుఁడు పువ్వుల నేసె మగువ నేలలు వ్రాసె
ఇరవగునీవలపు లింతగాఁ జేసే
తెరమరఁ గిది నీవు దీసినఁగాని పోదు
యెరవు సేయక నే మేమన్నా వాదు
(॥॥)
చందురుఁడు జామెక్కె సతి చింతలోఁజిక్కె
అందపు నీచలములే అన్నియు దక్కె
నింద లిన్నయు నిట్టె నీమీఁద గురియాయ
అందిపొంది నేఁడు మాకు నాడఁదరియాయ
(॥॥)
చల్లగాలి కడుహెచ్చె సతి గరఁగఁగ జొచ్చె
ఇల్లిదే నీమాటపటులిప్పుడే వచ్చె
చెల్లుఁబడిఁ గూడితివి శ్రీ వేంకటేశ యీచెలి
బల్లిదురాలాయ నేము పైతరవు సేయ
(||pallavi||)
vichcheyavayyā vĕlam̐dim̐ jūduvu gāni
ichchagamulāḍemu yĕṭṭayinām̐ gāni
(||||)
marum̐ḍu puvvula nesĕ maguva nelalu vrāsĕ
iravagunīvalabu liṁtagām̐ jese
tĕramaram̐ gidi nīvu dīsinam̐gāni podu
yĕravu seyaga ne memannā vādu
(||||)
saṁdurum̐ḍu jāmĕkkĕ sadi siṁtalom̐jikkĕ
aṁdabu nīsalamule anniyu dakkĕ
niṁda linnayu niṭṭĕ nīmīm̐da guriyāya
aṁdibŏṁdi nem̐ḍu māgu nāḍam̐dariyāya
(||||)
sallagāli kaḍuhĕchchĕ sadi garam̐gam̐ga jŏchchĕ
illide nīmāḍabaḍulippuḍe vachchĕ
sĕllum̐baḍim̐ gūḍidivi śhrī veṁkaḍeśha yīsĕli
ballidurālāya nemu paidaravu seya