విచ్చేయవయ్యా వేగమే అక్కడికి
(॥పల్లవి॥)
విచ్చేయవయ్యా వేగమే అక్కడికి
అచ్చమైన కోరికతో నలసీఁ జెలి
(॥॥)
వుప్పరిగెలోన నీవు వున్నాఁడవంటా వచ్చి
అప్పుడే రావైతివంటా నడిగీఁ జెలి
తొప్పఁ దోఁగేచెమటతో తూగుమంచముపైఁబండి
ముప్పిరి మోహములోన మునిఁగీఁ జెలి
(॥॥)
వేడుకతో నీకు నిట్టే వీడెమిచ్చేనంటా వచ్చి
వీడుపడి యందు నిందు వెదకీఁ జెలి
వాడుచు మలగుమీఁద వడి నొరగుండి తాను
పాడించుకొనీ నీపై పాటలిన్నీఁ జెలి
(॥॥)
వుట్టిపడి నీవు కొలువున్నాఁడవంటా విని
అట్టె నిన్ను రమ్మని చెప్పెంపీఁ జెలి
గుట్టున శ్రీ వేంకటేశ కూడి యలమేలుమంగ
నట్టనడుమ నిందుకే నవ్వీఁజెలి
(||pallavi||)
vichcheyavayyā vegame akkaḍigi
achchamaina korigado nalasīm̐ jĕli
(||||)
vupparigĕlona nīvu vunnām̐ḍavaṁṭā vachchi
appuḍe rāvaidivaṁṭā naḍigīm̐ jĕli
tŏppam̐ dom̐gesĕmaḍado tūgumaṁchamubaim̐baṁḍi
muppiri mohamulona munim̐gīm̐ jĕli
(||||)
veḍugado nīgu niṭṭe vīḍĕmichchenaṁṭā vachchi
vīḍubaḍi yaṁdu niṁdu vĕdagīm̐ jĕli
vāḍusu malagumīm̐da vaḍi nŏraguṁḍi tānu
pāḍiṁchugŏnī nībai pāḍalinnīm̐ jĕli
(||||)
vuṭṭibaḍi nīvu kŏluvunnām̐ḍavaṁṭā vini
aṭṭĕ ninnu rammani sĕppĕṁpīm̐ jĕli
guṭṭuna śhrī veṁkaḍeśha kūḍi yalamelumaṁga
naṭṭanaḍuma niṁduge navvīm̐jĕli