Vichchanavidaaya nemdu vera pela yimka neegu

విచ్చనవిడాయ నేఁడు వెర పేల యిఁక నీకు
Language

(॥పల్లవి॥)
విచ్చనవిడాయ నేఁడు వెర పేల యిఁక నీకు
నిచ్చలమాయ మనసు నే మేమనేమయ్యా

(॥విచ్చ॥)
కన్నుల మొక్కితిమీ కాఁకలఁ జిక్కితిమీ
సన్నలు మాతో నింకాఁ జాలదా అయ్యా
వెన్నెలలే యెండ లాయ వేగి యిది వొ ద్దాయ
నిన్నుఁ గాక వచ్చె నిట్టె నే మే మనే మయ్యా

(॥విచ్చ॥)
యిచ్చక మాడితిమీ యింతగా నోడితిమీ
మచ్చిక లింకా మాతో మానవా అయ్యా
రచ్చలో నిన్నుఁ గంటిమి రాతిరే వింటిమి మాట
నెచ్చెలిచేఁ జెప్పెంపేవు నే మే మనే మయ్యా

(॥విచ్చన॥)
కుందువ తెరిగితిమీ కాఁగిటఁ గరఁగితిమీ
సందడి నవ్వేవు మాతో చలమా అయ్యా
యిందుకె శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
నింద లెల్లాఁ బాసె నిన్ను నే మే మనే మయ్యా

(||pallavi||)
vichchanaviḍāya nem̐ḍu vĕra pela yim̐ka nīgu
nichchalamāya manasu ne memanemayyā

(||vichcha||)
kannula mŏkkidimī kām̐kalam̐ jikkidimī
sannalu mādo niṁkām̐ jāladā ayyā
vĕnnĕlale yĕṁḍa lāya vegi yidi vŏ ddāya
ninnum̐ gāga vachchĕ niṭṭĕ ne me mane mayyā

(||vichcha||)
yichchaga māḍidimī yiṁtagā noḍidimī
machchiga liṁkā mādo mānavā ayyā
rachchalo ninnum̐ gaṁṭimi rādire viṁṭimi māḍa
nĕchchĕlisem̐ jĕppĕṁpevu ne me mane mayyā

(||vichchana||)
kuṁduva tĕrigidimī kām̐giḍam̐ garam̐gidimī
saṁdaḍi navvevu mādo salamā ayyā
yiṁdugĕ śhrīvĕṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
niṁda lĕllām̐ bāsĕ ninnu ne me mane mayyā