Vichchalavidai meeru vinodimturugaaga

విచ్చలవిడై మీరు వినోదింతురుగాక
Language

(॥పల్లవి॥)
విచ్చలవిడై మీరు వినోదింతురుగాక
హెచ్చెను తమకములు ఇఁకనేల జాగులు

(॥విచ్చ॥)
వేవేగ రమ్మనుచు వెలఁది లేకలు వ్రాసి
పావురము మెడఁగట్టి పంపె నీకను
నీవది చదువుకొని నెమ్మిఁ బతికమ్మ వెట్టి
యీవేళనే అంపితివి ఇఁకనేల జాగులు

(॥విచ్చ॥)
కలికి నీరాకకుఁ గాచుకవుందాననని
చిలుకచే విన్నపాలు చెప్పిపంపెను
మలసి నీవని విని మారుత్తరములు నేర్పి
యెలమితో నంపితివి ఇఁకనేల జాగులు

(॥విచ్చ॥)
దతి యలమేల్‌మంగ చూపులు నీ కెదురంపె
యెదుటనే నిలిచితి వింతలో నీవు
కదిసి పెండ్లాడితివి గక్కన శ్రీవేంకటేశ
యిదె కంటి మిందరము ఇకఁనేల జాగులు

(||pallavi||)
vichchalaviḍai mīru vinodiṁturugāga
hĕchchĕnu tamagamulu im̐kanela jāgulu

(||vichcha||)
vevega rammanusu vĕlam̐di legalu vrāsi
pāvuramu mĕḍam̐gaṭṭi paṁpĕ nīganu
nīvadi saduvugŏni nĕmmim̐ badigamma vĕṭṭi
yīveḽane aṁpidivi im̐kanela jāgulu

(||vichcha||)
kaligi nīrāgagum̐ gāsugavuṁdānanani
silugase vinnabālu sĕppibaṁpĕnu
malasi nīvani vini māruttaramulu nerbi
yĕlamido naṁpidivi im̐kanela jāgulu

(||vichcha||)
dadi yalamel‌maṁga sūbulu nī kĕduraṁpĕ
yĕduḍane nilisidi viṁtalo nīvu
kadisi pĕṁḍlāḍidivi gakkana śhrīveṁkaḍeśha
yidĕ kaṁṭi miṁdaramu igam̐nela jāgulu