Vibhunim dodugavachche vesa nannee mamchivayyee

విభునిఁ దోడుకవచ్చే వెస నన్నీ మంచివయ్యీ
Language

(॥పల్లవి॥)
విభునిఁ దోడుకవచ్చే వెస నన్నీ మంచివయ్యీ
యిభయానకుఁ జేయరే యిట్టే వుపచారాలు

(॥విభు॥)
వెలఁదికిఁ జందురుఁ డీవేళఁ జుట్టమవుఁగాని
కలువలు కొప్పున గక్కన వించరే
కలపుకోలున చల్లగానలి మన్నించుఁగాని
మలయజ మలఁదరే మందుగాను మేనను

(॥విభు॥)
ముద్దియకుఁ దాపరవి మొకమోడి వుండుఁగాని
వొద్దికఁ దామరపైఁ గూచుండఁబెట్టరే
గద్దరివసంతునకుం గడునిచ్చకమౌఁగాని
పొద్దువొద్దునకు పైపైఁ బుప్పొడి చల్లరే

(॥విభు॥)
పన్నుకొని మేఘానకుఁ బరిణామ మవుఁగాని
చిన్న నెమ్మళ్లవాసిన చీర గట్టరే
యెన్నఁగ శ్రీవేంకటేశుఁ డీకె యలమేలుమంగ
యిన్నిటా విచ్చేసికూడె యింటనే వున్నాఁడు

(||pallavi||)
vibhunim̐ doḍugavachche vĕsa nannī maṁchivayyī
yibhayānagum̐ jeyare yiṭṭe vubasārālu

(||vibhu||)
vĕlam̐digim̐ jaṁdurum̐ ḍīveḽam̐ juṭṭamavum̐gāni
kaluvalu kŏppuna gakkana viṁchare
kalabugoluna sallagānali manniṁchum̐gāni
malayaja malam̐dare maṁdugānu menanu

(||vibhu||)
muddiyagum̐ dābaravi mŏgamoḍi vuṁḍum̐gāni
vŏddigam̐ dāmarabaim̐ gūsuṁḍam̐bĕṭṭare
gaddarivasaṁtunaguṁ gaḍunichchagamaum̐gāni
pŏdduvŏddunagu paibaim̐ buppŏḍi sallare

(||vibhu||)
pannugŏni meghānagum̐ bariṇāma mavum̐gāni
sinna nĕmmaḽlavāsina sīra gaṭṭare
yĕnnam̐ga śhrīveṁkaḍeśhum̐ ḍīgĕ yalamelumaṁga
yinniḍā vichchesigūḍĕ yiṁṭane vunnām̐ḍu