Vibhunido nimkanele vesaalu

విభునితో నిఁకనేలే వేసాలు
Language

(॥పల్లవి॥)
విభునితో నిఁకనేలే వేసాలు
సుభసోభ(శుభశోభ)నములెల్లాఁ జూపవలెఁ గాని

(॥॥)
చేరి సంగడిఁ గూచుండి సిగ్గులువడితేఁ బోదు
వూరకే తలవంచుక వుండఁ గరాదు
గోరగీరఁగా నొడ్డుకొంటే సంగతి గాదు
కూరిమితో రతి కియ్యకొనవలెఁ గాని

(॥॥)
తప్పక మొగాలు చూచి తలవంచుకొంటేఁ బోదు
ముప్పిరిఁ జిరునవ్వులు ముయ్యఁగరాదు
పిప్పిగా మోవి యానఁ బెనఁగేది బుద్దిగాదు
కుప్పలు దెప్పలుగాఁ గూడవలెఁ గాని

(॥॥)
జిగిఁ జన్నులు సోఁకించి చెమరించితేఁ బోదు
అగపడి కాఁగిలించి యలయరాదు
వెగటు లేక యేలె శ్రీ వేంకటేశుఁ డిట్టె నిన్ను
తగులై యిట్లానే పొందఁగవలెఁ గాని

(||pallavi||)
vibhunido nim̐kanele vesālu
subhasobha(śhubhaśhobha)namulĕllām̐ jūbavalĕm̐ gāni

(||||)
seri saṁgaḍim̐ gūsuṁḍi sigguluvaḍidem̐ bodu
vūrage talavaṁchuga vuṁḍam̐ garādu
goragīram̐gā nŏḍḍugŏṁṭe saṁgadi gādu
kūrimido radi kiyyagŏnavalĕm̐ gāni

(||||)
tappaga mŏgālu sūsi talavaṁchugŏṁṭem̐ bodu
muppirim̐ jirunavvulu muyyam̐garādu
pippigā movi yānam̐ bĕnam̐gedi buddigādu
kuppalu dĕppalugām̐ gūḍavalĕm̐ gāni

(||||)
jigim̐ jannulu som̐kiṁchi sĕmariṁchidem̐ bodu
agabaḍi kām̐giliṁchi yalayarādu
vĕgaḍu lega yelĕ śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnu
tagulai yiṭlāne pŏṁdam̐gavalĕm̐ gāni