Vibhunido nalugaga vide miyya ve

విభునితో నలుగక విడె మియ్య వే
Language

(॥పల్లవి॥)
విభునితో నలుగక విడె మియ్య వే
సభలోన నెట్టుండినా సాదించఁ దగునా

(॥విభు॥)
వొగ్గి యేపొద్దుఁ గాచుక వొద్ద నుండేవారికి
యెగ్గు లెంచుకొనే మంటే నెంత లేదు
కగ్గు లేక రతులను కాఁగిలించుకొన్నపుడు
సిగ్గులు వడేమనఁ జెల్లునా యెవ్వరికి

(॥విభు॥)
అదిఁ గొని మంచిమాట లాడఁగానే చూచి చూచి
వాదడఁచితేఁ గాదనేవా రెవ్వరు
పోదితోడఁ గంచముపొత్తులు గలసె మరి
కాదు గూడ దంటే సంగతు లయ్యీనా

(॥విభు॥)
అంతటాను చుట్టరిక మమరి వుండఁగాను
పంతములు నెరపఁగఁ బాడి గాదు
ఇంతలోనే శ్రీ వేంకటేశుఁ డిదె నిన్నుఁ గూడె
వింతలు సేయఁ జూచితే వివరము లౌనా

(||pallavi||)
vibhunido nalugaga viḍĕ miyya ve
sabhalona nĕṭṭuṁḍinā sādiṁcham̐ dagunā

(||vibhu||)
vŏggi yebŏddum̐ gāsuga vŏdda nuṁḍevārigi
yĕggu lĕṁchugŏne maṁṭe nĕṁta ledu
kaggu lega radulanu kām̐giliṁchugŏnnabuḍu
siggulu vaḍemanam̐ jĕllunā yĕvvarigi

(||vibhu||)
adim̐ gŏni maṁchimāḍa lāḍam̐gāne sūsi sūsi
vādaḍam̐sidem̐ gādanevā rĕvvaru
podidoḍam̐ gaṁchamubŏttulu galasĕ mari
kādu gūḍa daṁṭe saṁgadu layyīnā

(||vibhu||)
aṁtaḍānu suṭṭariga mamari vuṁḍam̐gānu
paṁtamulu nĕrabam̐gam̐ bāḍi gādu
iṁtalone śhrī veṁkaḍeśhum̐ ḍidĕ ninnum̐ gūḍĕ
viṁtalu seyam̐ jūside vivaramu launā