Vibhumdu vadda nunnaamdu vevelu samdaalaanu

విభుఁడు వద్ద నున్నాఁడు వేవేలు చందాలాను
Language

(॥పల్లవి॥)
విభుఁడు వద్ద నున్నాఁడు వేవేలు చందాలాను
సభలో సిగ్గు లేటికే చనవరి తాను

(॥॥)
చిన్నఁబోవ నేటికే చెంగలించి వుండుగాక
మన్నన దేవులైన మగువ తాను
సన్న సేయ నేటికే చక్కఁగా మాటాడుఁగాక
కన్న వెల్లా నేర్చిన కలికి తాను

(॥॥)
తలుపు మాటేఁటికే దండనే కూచుండుఁ గాక
కులముతోడి పెండ్లికూఁతురు తాను
అలయఁగ నేఁటికే ఆసలఁ జేకొనఁగాక
పలురచనల మించె పంతగత్తె తాను

(॥॥)
కానుక లంప నేఁటికే కౌఁగిటనే కూడుఁగాక
పూని సలిగెలు చల్లే పొలఁతి దాను
ఆనుక శ్రీ వేంకటేశుఁ డంతలోనే నన్నుఁగూడె
ఆన లేఁటికే నిజమాడే లేమ తాను

(||pallavi||)
vibhum̐ḍu vadda nunnām̐ḍu vevelu saṁdālānu
sabhalo siggu leḍige sanavari tānu

(||||)
sinnam̐bova neḍige sĕṁgaliṁchi vuṁḍugāga
mannana devulaina maguva tānu
sanna seya neḍige sakkam̐gā māḍāḍum̐gāga
kanna vĕllā nersina kaligi tānu

(||||)
talubu māḍem̐ṭige daṁḍane kūsuṁḍum̐ gāga
kulamudoḍi pĕṁḍligūm̐turu tānu
alayam̐ga nem̐ṭige āsalam̐ jegŏnam̐gāga
palurasanala miṁchĕ paṁtagattĕ tānu

(||||)
kānuga laṁpa nem̐ṭige kaum̐giḍane kūḍum̐gāga
pūni saligĕlu salle pŏlam̐ti dānu
ānuga śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalone nannum̐gūḍĕ
āna lem̐ṭige nijamāḍe lema tānu