Vibhumdavu neevamdugu vesaruduraa

విభుఁడవు నీవందుకు వేసరుదురా
Language

(॥పల్లవి॥)
విభుఁడవు నీవందుకు వేసరుదురా
సభలోన వలపులు చల్లక విడుతురా

(॥విభ॥)
మగవాని యఱుతను మారుసతిఁ గంటేను
వెగటుగా సవతులు వెంగెమాడరా
చిగురుఁబెదవిమీఁద చేఁతలేమైనా నుంటే
అగడుసేసి పెనఁగి అలయించకుందురా

(॥విభ॥)
వొంటిఁ బొరుగులవారు వూడిగేలు సేయఁగాను
జంటలైన మగువలు సమ్మతింతురా
వెంట వెంట నీమేన వింతసొమ్ములుండితేను
సొంటులు సోదించి మరి చూడకుందురా

(॥విభ॥)
ఱట్టిడి వారకాంతలుఱక నిన్ను మెప్పించఁగ
పట్టపుదేవుళ్ళు కడుఁ బంతమాడరా
యిట్టే శ్రీవేంకటేశ యేలితివందరి నేఁడు
దిట్టిలైనవారు నిన్నుఁ దెలిసి పొగడరా

(||pallavi||)
vibhum̐ḍavu nīvaṁdugu vesarudurā
sabhalona valabulu sallaga viḍudurā

(||vibha||)
magavāni yaṟudanu mārusadim̐ gaṁṭenu
vĕgaḍugā savadulu vĕṁgĕmāḍarā
sigurum̐bĕdavimīm̐da sem̐talemainā nuṁṭe
agaḍusesi pĕnam̐gi alayiṁchaguṁdurā

(||vibha||)
vŏṁṭim̐ bŏrugulavāru vūḍigelu seyam̐gānu
jaṁṭalaina maguvalu sammadiṁturā
vĕṁṭa vĕṁṭa nīmena viṁtasŏmmuluṁḍidenu
sŏṁṭulu sodiṁchi mari sūḍaguṁdurā

(||vibha||)
ṟaṭṭiḍi vāragāṁtaluṟaga ninnu mĕppiṁcham̐ga
paṭṭabudevuḽḽu kaḍum̐ baṁtamāḍarā
yiṭṭe śhrīveṁkaḍeśha yelidivaṁdari nem̐ḍu
diṭṭilainavāru ninnum̐ dĕlisi pŏgaḍarā