విభుఁడ వింతటికి వెరవుతో ననుఁగావు
(॥పల్లవి॥)
విభుఁడ వింతటికి వెరవుతో ననుఁగావు
అభయహస్తముతోడి ఆదిమూలమా
(॥విభుఁ॥)
పలులంపటాలచేతఁ బాటుపడి పాటుపడి
అలసితిఁ గావవే వో ఆదిమూలమా
చలమరి యితరసంసారభ్రాంతిఁ జిక్కితి న-
న్నలరించి కావవే వో ఆదిమూలమా
(॥విభుఁ॥)
యెంతకైన నాసలచే యేఁగేఁగి వేసరితి-
నంత కోపఁ గావవే వో ఆదిమూలమా
సంతల చుట్టరికాల జడిసితి నిఁకఁ గావు
అంతరాత్మ నాపాలి ఆదిమూలమా
(॥విభుఁ॥)
రంటదెప్పు టింద్రియాల రవ్వైతిఁ గావవే వో-
అంటిన శ్రీవేంకటాద్రి ఆదిమూలమా
గెంటక ముమ్మాటికని నీకే శర-
ణంటిఁ గావవే వో ఆదిమూలమా
(||pallavi||)
vibhum̐ḍa viṁtaḍigi vĕravudo nanum̐gāvu
abhayahastamudoḍi ādimūlamā
(||vibhum̐||)
palulaṁpaḍālasedam̐ bāḍubaḍi pāḍubaḍi
alasidim̐ gāvave vo ādimūlamā
salamari yidarasaṁsārabhrāṁtim̐ jikkidi na-
nnalariṁchi kāvave vo ādimūlamā
(||vibhum̐||)
yĕṁtagaina nāsalase yem̐gem̐gi vesaridi-
naṁta kobam̐ gāvave vo ādimūlamā
saṁtala suṭṭarigāla jaḍisidi nim̐kam̐ gāvu
aṁtarātma nābāli ādimūlamā
(||vibhum̐||)
raṁṭadĕppu ṭiṁdriyāla ravvaidim̐ gāvave vo-
aṁṭina śhrīveṁkaḍādri ādimūlamā
gĕṁṭaga mummāḍigani nīge śhara-
ṇaṁṭim̐ gāvave vo ādimūlamā