(॥పల్లవి॥)
విపరీతము లివి వినరాదు
వుపమలెల్ల మీవొద్దనె కలిగె
(॥విప॥)
వువిదవదనచంద్రోదయవేళను
రవియగుసూర్యప్రభ నీవేఁగఁగ
యివల నవల మీయిద్దరివలననే
దినమును రాతిరి దెలియఁగఁ గలిగె
(॥విప॥)
అంగనతురుముమహిర్షి శివేళను
రంగగు సూర్యప్రభ నీవేఁగఁగ
సంగడి వెలుఁగును సరిఁ జీఁకటియును
చెంగట మీయందే చెప్పఁగఁ గలిగె
(॥విప॥)
కాంతమోవి చుక్కల నిండువేళ
రంతుల సూర్యప్రభ నీవేఁగఁగ
యింతట శ్రీవేంకటేశ్వర మీయందే
కాంతులుఁ గళలునుఁ గలయుట గలిగె
(||pallavi||)
vibarīdamu livi vinarādu
vubamalĕlla mīvŏddanĕ kaligĕ
(||viba||)
vuvidavadanasaṁdrodayaveḽanu
raviyagusūryaprabha nīvem̐gam̐ga
yivala navala mīyiddarivalanane
dinamunu rādiri dĕliyam̐gam̐ galigĕ
(||viba||)
aṁganadurumumahirṣhi śhiveḽanu
raṁgagu sūryaprabha nīvem̐gam̐ga
saṁgaḍi vĕlum̐gunu sarim̐ jīm̐kaḍiyunu
sĕṁgaḍa mīyaṁde sĕppam̐gam̐ galigĕ
(||viba||)
kāṁtamovi sukkala niṁḍuveḽa
raṁtula sūryaprabha nīvem̐gam̐ga
yiṁtaḍa śhrīveṁkaḍeśhvara mīyaṁde
kāṁtulum̐ gaḽalunum̐ galayuḍa galigĕ