వేవేలు విన్నపాలేల వేగినంతాను
(॥పల్లవి॥)
వేవేలు విన్నపాలేల వేగినంతాను
నీవి దయాధర్మములు నీ చిత్త మికను
(॥వేవేలు॥)
అరసి చూడక నే శతాపరాధములు చేసి
శరణు నీకుఁ జొచ్చితి సర్వేశ్వరా
సరి శరణాగతరక్షకబిరుదది నీది
నిరతి నా భాగ్యము నీ చిత్త మిఁకను
(॥వేవేలు॥)
అహరహిమును సహస్రాపరాధములు చేసి
వహి కెక్కి నీ లెంకపాఁడ నైతిని
బహుగతి భక్తపరిపాలన బిరుదు నీది
నిహితపు నా గతి నీ చిత్త మిఁకను
(॥వేవేలు॥)
సన్నిది శ్రీవేంకటేశ సర్వాపరాధముల్ చేసి
అన్నిటికి శలవు నీ యచ్చు మోచితి
వున్నతి నా ర్తత్రాణవుద్యోగబిరుదు నీది
నిన్ను నన్ను విచారించు నీ చిత్త మిఁకను
(||pallavi||)
vevelu vinnabālela veginaṁtānu
nīvi dayādharmamulu nī sitta miganu
(||vevelu||)
arasi sūḍaga ne śhadābarādhamulu sesi
śharaṇu nīgum̐ jŏchchidi sarveśhvarā
sari śharaṇāgadarakṣhagabirudadi nīdi
niradi nā bhāgyamu nī sitta mim̐kanu
(||vevelu||)
aharahimunu sahasrābarādhamulu sesi
vahi kĕkki nī lĕṁkabām̐ḍa naidini
bahugadi bhaktabaribālana birudu nīdi
nihidabu nā gadi nī sitta mim̐kanu
(||vevelu||)
sannidi śhrīveṁkaḍeśha sarvābarādhamul sesi
anniḍigi śhalavu nī yachchu mosidi
vunnadi nā rdatrāṇavudyogabirudu nīdi
ninnu nannu visāriṁchu nī sitta mim̐kanu