Vevelu tappulu gallaa venaga vesugonumee

వేవేలు తప్పులు గల్లా వెనక వేసుకొనుమీ
Language

(॥పల్లవి॥)
వేవేలు తప్పులు గల్లా వెనక వేసుకొనుమీ
నీవాఁడ నైనందులకు నీవే దయఁ జూడుమీ

(॥వేవేలు॥)
మగనికి నేప్రొద్దుఁ బ్రేమపుటాల నైనట్లు
పగటున నేలికెకు బంట నైనట్టు
నిగిడి యట్టే తండ్రికి నిజపుత్రుఁడ నైనట్టు
తగులాయ మైతిఁ జుమ్మీ దైవమా నీకు

(॥వేవేలు॥)
అన్నిటా భూమేలేవాని కరిగాఁప నైనట్టు
వున్నతి గురునికి శిష్యుడ నైనట్టు
కొన్న యజమానునికి కోరి దాసి నైనట్టు
పన్నిన లంకెనేఁ జుమ్మీ పరమాత్మ నీకు

(॥వేవేలు॥)
పెంచుకొన్నవారికి పెంపుడుఁగుఱ్ఱ నైనట్టు
చంచుల దేవతకుఁ బూజరి నైనట్టు
యెంచఁగ శ్రీవేంకటేశ యెందుఁ జూచినా నేను
అంచితానుబంది సుమ్మీఆదిమూర్తి నీకు

(||pallavi||)
vevelu tappulu gallā vĕnaga vesugŏnumī
nīvām̐ḍa nainaṁdulagu nīve dayam̐ jūḍumī

(||vevelu||)
maganigi neprŏddum̐ bremabuḍāla nainaṭlu
pagaḍuna neligĕgu baṁṭa nainaṭṭu
nigiḍi yaṭṭe taṁḍrigi nijabutrum̐ḍa nainaṭṭu
tagulāya maidim̐ jummī daivamā nīgu

(||vevelu||)
anniḍā bhūmelevāni karigām̐pa nainaṭṭu
vunnadi gurunigi śhiṣhyuḍa nainaṭṭu
kŏnna yajamānunigi kori dāsi nainaṭṭu
pannina laṁkĕnem̐ jummī paramātma nīgu

(||vevelu||)
pĕṁchugŏnnavārigi pĕṁpuḍum̐guṭra nainaṭṭu
saṁchula devadagum̐ būjari nainaṭṭu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yĕṁdum̐ jūsinā nenu
aṁchidānubaṁdi summīādimūrdi nīgu