Vevelu nee suddulu vinanedigi

వేవేలు నీ సుద్దులు విననేటికి
Language

(॥పల్లవి॥)
వేవేలు నీ సుద్దులు విననేటికి
బావ నీకు నాతఁడై తే బతుకఁగదే నీవు

(॥వేవే॥)
పోత్తులసవతిమాట పోసఁగ నాతోనాడేవు
హత్తినయాతనిపొందు లట్టె చెప్పేవు
కొత్తదానివలెనే నీగుఱుతులు దెలిపేవు
బత్తిగలదానవైతే బతుకఁగదే నీవు

(॥వేవే॥)
సందడిలోననే మాసరుసఁ గూచుండేవు
చెంది మాతో విడేలకుఁ జేయిచాఁచేవు
మందలించి నీవావులు మాకునేల కలుపేవు
బందుగురాలవైతే బతుకగదే నీవు

(॥వేవే॥)
పలుమారు నీకిచ్చినబంగారాలు చూపేవు
పలికి నీచువులు పచారించేవు
యిల నలమేల్ మంగను యేలె శ్రీవేంకటేశుఁడు
బలిమి నీతో నవ్వితే బతుకఁగదే నీవు

(||pallavi||)
vevelu nī suddulu vinaneḍigi
bāva nīgu nādam̐ḍai te badugam̐gade nīvu

(||veve||)
pottulasavadimāḍa posam̐ga nādonāḍevu
hattinayādanibŏṁdu laṭṭĕ sĕppevu
kŏttadānivalĕne nīguṟudulu dĕlibevu
battigaladānavaide badugam̐gade nīvu

(||veve||)
saṁdaḍilonane māsarusam̐ gūsuṁḍevu
sĕṁdi mādo viḍelagum̐ jeyisām̐sevu
maṁdaliṁchi nīvāvulu māgunela kalubevu
baṁdugurālavaide badugagade nīvu

(||veve||)
palumāru nīgichchinabaṁgārālu sūbevu
paligi nīsuvulu pasāriṁchevu
yila nalamel maṁganu yelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
balimi nīdo navvide badugam̐gade nīvu