వేవేలు జాగు లిఁక విడవయ్యా
(॥పల్లవి॥)
వేవేలు జాగు లిఁక విడవయ్యా
యీ వేళ నాకుఁ జన వియ్యవయ్యా
(॥వేవేలు॥)
శిర సేల వంచేవు సిగ్గు లేల పెంచేవు
సొరిది మా వంక నిటు చూడవయ్యా
మరిగి యున్నదాన మాయ లెల్ల విన్నదాన
యిరవు నేయఁగ నిక నేఁటి కయ్యా
(॥వేవేలు॥)
యేడ పరాకై వున్నాఁడ వేమి దలఁచుకొన్నాఁడ
వాడఁగలమాట లెల్ల నాడవయ్య
మేడెపువల పిదివో మెత్తనిపర పిదివో
వాడిక నీమేలు నాపై వంచవయ్యా
(॥వేవేలు॥)
చెక్కు లేల నొక్కేవు చెంది యేల చొక్కేవు
పక్కన యింటిలోనికిఁ బదవయ్యా
యిక్కువ శ్రీవెంకటేశ యెనసితి వింకా నాస
నిక్కీ నాకు నన్నిట్టె మన్నించవయ్యా
(||pallavi||)
vevelu jāgu lim̐ka viḍavayyā
yī veḽa nāgum̐ jana viyyavayyā
(||vevelu||)
śhira sela vaṁchevu siggu lela pĕṁchevu
sŏridi mā vaṁka niḍu sūḍavayyā
marigi yunnadāna māya lĕlla vinnadāna
yiravu neyam̐ga niga nem̐ṭi kayyā
(||vevelu||)
yeḍa parāgai vunnām̐ḍa vemi dalam̐sugŏnnām̐ḍa
vāḍam̐galamāḍa lĕlla nāḍavayya
meḍĕbuvala pidivo mĕttanibara pidivo
vāḍiga nīmelu nābai vaṁchavayyā
(||vevelu||)
sĕkku lela nŏkkevu sĕṁdi yela sŏkkevu
pakkana yiṁṭilonigim̐ badavayyā
yikkuva śhrīvĕṁkaḍeśha yĕnasidi viṁkā nāsa
nikkī nāgu nanniṭṭĕ manniṁchavayyā