Vevelu gosari veridi

వేవేలు గొసరి వేరితి
Language

(॥పల్లవి॥)
వేవేలు గొసరి వేరితి
యీవల నాడే యిచ్చక మిఁకనూ

(॥వేవే॥)
యెచ్చుకుందు లటు యెవ్వరు సేసిన
తుచ్చంబున నిను దూరుదును
నచ్చుల నెన్నాళ్ళు నాచేతిసణఁగులు
మెచ్చే విఁక నిను మేలని పొగడి

(॥వేవే॥)
పలువిహరములను బడలినయప్పుడు
అలుగుదు నీతో నంకెకును
తొలి తొలి నాచేతిదోసము నీకేలా
వెలయఁగ నిను దీవించెద నిఁకనూ

(॥వేవే॥)
కనుఁ గొని నీవే కలసేటియపుడు
తనిసినదాఁకాఁ దమకింతూ
యెనసితి శ్రీవేంకటేశ్వర నన్నిదె
మునుపు వెనకలకు ముంచెద నిఁకనూ

(||pallavi||)
vevelu gŏsari veridi
yīvala nāḍe yichchaga mim̐kanū

(||veve||)
yĕchchuguṁdu laḍu yĕvvaru sesina
tuchchaṁbuna ninu dūrudunu
nachchula nĕnnāḽḽu nāsedisaṇam̐gulu
mĕchche vim̐ka ninu melani pŏgaḍi

(||veve||)
paluviharamulanu baḍalinayappuḍu
alugudu nīdo naṁkĕgunu
tŏli tŏli nāsedidosamu nīgelā
vĕlayam̐ga ninu dīviṁchĕda nim̐kanū

(||veve||)
kanum̐ gŏni nīve kalaseḍiyabuḍu
tanisinadām̐kām̐ damagiṁtū
yĕnasidi śhrīveṁkaḍeśhvara nannidĕ
munubu vĕnagalagu muṁchĕda nim̐kanū