Vevelu damdaalu neegu vidaraa nannu

వేవేలు దండాలు నీకు విడరా నన్ను
Language

(॥పల్లవి॥)
వేవేలు దండాలు నీకు విడరా నన్ను
యీవల నింత లేకున్న యెట్లు దరించేవురా

(॥వేవేలు॥)
వాడుఁగన్నుల చూపుల వడి నాపై నొరగేవు
యేడ నేరుచుకొంటివి యేరా నీవు
ఆడికెకు నామీఁద నంత బత్తి గలయట్టె
వీడె మియ్య వచ్చేవు వెరతురా నీకు

(॥వేవేలు॥)
నవ్వుల జాణతనాలు నయగారి వినయాలు
యెవ్వతె నేరిపెరా యేరా నీకు
పవ్వళించి యింతలోనె పైఁ గాలు చాఁచేవు
జవ్వని నింత యాఁప దోసమురా నీకు

(॥వేవేలు॥)
కామించి కలయు మని కాఁగిటిలో దైన్యములు
యేమి అభ్యసించితవి యేరా నీవు
చే ముంచి శ్రీవెంకటేశ చెలఁగి కూడితి నన్ను
వాముల ని దెల్లా మరవకురా నీవూ

(||pallavi||)
vevelu daṁḍālu nīgu viḍarā nannu
yīvala niṁta legunna yĕṭlu dariṁchevurā

(||vevelu||)
vāḍum̐gannula sūbula vaḍi nābai nŏragevu
yeḍa nerusugŏṁṭivi yerā nīvu
āḍigĕgu nāmīm̐da naṁta batti galayaṭṭĕ
vīḍĕ miyya vachchevu vĕradurā nīgu

(||vevelu||)
navvula jāṇadanālu nayagāri vinayālu
yĕvvadĕ neribĕrā yerā nīgu
pavvaḽiṁchi yiṁtalonĕ paim̐ gālu sām̐sevu
javvani niṁta yām̐pa dosamurā nīgu

(||vevelu||)
kāmiṁchi kalayu mani kām̐giḍilo dainyamulu
yemi abhyasiṁchidavi yerā nīvu
se muṁchi śhrīvĕṁkaḍeśha sĕlam̐gi kūḍidi nannu
vāmula ni dĕllā maravagurā nīvū