వేవేలకు నొకటే విన్నప మిదే
(॥పల్లవి॥)
వేవేలకు నొకటే విన్నప మిదే
చేవదేరె వలపులు చిత్తగించవయ్యా
(॥వేవే॥)
వూరనూర నూఁటలాయ నువిదకుఁ జెమటలు
కోరికలైతేఁ బెద్దకొండలాయను
కారుకొని తమకము గంపలకొలఁదులాయ
చేరవచ్చి మగువనుఁ జిత్తగించవయ్యా
(॥వేవే॥)
చెప్పఁజెప్పఁ గొత్తలాయ చెలిచెక్కిటిచింతలు
ముప్పిరిగొన్నయాసలు మోపులాయను
కప్పి నీసుద్దులు వినఁగడుఁదరితీపులాయ
చిప్పిల మాఁటాడీ యింతిఁ జిత్తగించవయ్యా
(॥వేవే॥)
చూడఁజూడ సొంపులెక్కె సుదతిమోముకళలు
వేడికలైతే వెల్లావిరులాయను
యీడనె శ్రీవేంకటేశ యేలితివి మన్నించి
చేడె నీకు దేవులాయఁ జిత్తిగించవయ్యా
(||pallavi||)
vevelagu nŏgaḍe vinnaba mide
sevaderĕ valabulu sittagiṁchavayyā
(||veve||)
vūranūra nūm̐ṭalāya nuvidagum̐ jĕmaḍalu
korigalaidem̐ bĕddagŏṁḍalāyanu
kārugŏni tamagamu gaṁpalagŏlam̐dulāya
seravachchi maguvanum̐ jittagiṁchavayyā
(||veve||)
sĕppam̐jĕppam̐ gŏttalāya sĕlisĕkkiḍisiṁtalu
muppirigŏnnayāsalu mobulāyanu
kappi nīsuddulu vinam̐gaḍum̐daridībulāya
sippila mām̐ṭāḍī yiṁtim̐ jittagiṁchavayyā
(||veve||)
sūḍam̐jūḍa sŏṁpulĕkkĕ sudadimomugaḽalu
veḍigalaide vĕllāvirulāyanu
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi manniṁchi
seḍĕ nīgu devulāyam̐ jittigiṁchavayyā