Vevelagu neegu neeve visaarimchi mannimchu

వేవేలకు నీకు నీవే విచారించి మన్నించు
Language

(॥పల్లవి॥)
వేవేలకు నీకు నీవే విచారించి మన్నించు
భావించి యెన్నఁడునుఁ బాయకుమీ నన్నును

(॥॥)
చిగురుమోవిమాటలు చిత్తానఁ బట్టీనా
నగుతానాడినవల్లా నమ్మికయ్యీనా
మొగి విచ్చని నాలోని మోహము చూతువు గాని
తగవులఁ బెట్టికు మీ తరుణి నే నీకు

(॥॥)
మునుకొన్న వినయాలు ముచ్చటలు దెలిపీనా
చనవరి వూడిగాలు చవి రేఁచీనా
అనువైన నాతగులాయములెంతువు గాని
పెనఁగించుకొనకుమీ ప్రియురాల నేను

(॥॥)
జవ్వనపుమదములు సందిమాటలాడీనా
కువ్వలైన గుణములు కొంగువట్టీనా
యివ్వల శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
మవ్వమైన అలమేలుమంగఁ జుమీ నేను

(||pallavi||)
vevelagu nīgu nīve visāriṁchi manniṁchu
bhāviṁchi yĕnnam̐ḍunum̐ bāyagumī nannunu

(||||)
sigurumovimāḍalu sittānam̐ baṭṭīnā
nagudānāḍinavallā nammigayyīnā
mŏgi vichchani nāloni mohamu sūduvu gāni
tagavulam̐ bĕṭṭigu mī taruṇi ne nīgu

(||||)
munugŏnna vinayālu muchchaḍalu dĕlibīnā
sanavari vūḍigālu savi rem̐sīnā
anuvaina nādagulāyamulĕṁtuvu gāni
pĕnam̐giṁchugŏnagumī priyurāla nenu

(||||)
javvanabumadamulu saṁdimāḍalāḍīnā
kuvvalaina guṇamulu kŏṁguvaṭṭīnā
yivvala śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
mavvamaina alamelumaṁgam̐ jumī nenu