Vevelagu ne ninnu vemdugonenu

వేవేలకు నే నిన్ను వేఁడుకొనేను
Language

(॥పల్లవి॥)
వేవేలకు నే నిన్ను వేఁడుకొనేను
మా వంకఁ దప్పు గలిగితే మన్నించవయ్యా

(॥॥)
మఱి నీ చిత్తము రా మాటలాడే నంటా వచ్చి
యెఱుఁగ కేమాడుదునో యెగ్గు పట్టకువయ్యా
వుఱక బత్తితోఁ బాదా లొత్తఁ గా నా కంకణాలు
వొఱసి యాడ నొత్తునో వోరుచుకోవయ్యా

(॥॥)
యిచ్చకముగాఁ గౌఁగిలియ్య వచ్చి చన్నులనుఁ
గుచ్చి యెంత యొత్తుదునో కోపగించకువయ్యా
మచ్చిక తోనే నీకు మరిగి వీడె మియ్యఁ గా
యెచ్చు కుందు లెట్టుండునో యింపు సేసుకోవయ్యా

(॥॥)
దప్పి దేర మోవితేనె తతి గొని యియ్య వచ్చి
చిప్పిల నేమి సేతునో చేకొనవయ్యా
యిప్పుడే శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నీ
కొప్పు ముడువఁ గా నెట్టో గుట్టు సేసుకోవయ్యా

(||pallavi||)
vevelagu ne ninnu vem̐ḍugŏnenu
mā vaṁkam̐ dappu galigide manniṁchavayyā

(||||)
maṟi nī sittamu rā māḍalāḍe naṁṭā vachchi
yĕṟum̐ga kemāḍuduno yĕggu paṭṭaguvayyā
vuṟaga battidom̐ bādā lŏttam̐ gā nā kaṁkaṇālu
vŏṟasi yāḍa nŏttuno vorusugovayyā

(||||)
yichchagamugām̐ gaum̐giliyya vachchi sannulanum̐
guchchi yĕṁta yŏttuduno kobagiṁchaguvayyā
machchiga tone nīgu marigi vīḍĕ miyyam̐ gā
yĕchchu kuṁdu lĕṭṭuṁḍuno yiṁpu sesugovayyā

(||||)
dappi dera movidenĕ tadi gŏni yiyya vachchi
sippila nemi seduno segŏnavayyā
yippuḍe śhrī veṁkaḍeśha yelidivi nannu nī
kŏppu muḍuvam̐ gā nĕṭṭo guṭṭu sesugovayyā