వేవేలకు మాకు నిఁక వెఱవఁగఁ బనిలేదు
(॥పల్లవి॥)
వేవేలకు మాకు నిఁక వెఱవఁగఁ బనిలేదు
సేవలు నే మేమైనాఁ జేతుము నీకిఁకను
(॥వేవే॥)
తాలిమిగలవాఁడవు తరుణులెల్లా నాడేటి
మేలములకెల్లా నీమే నోరుచును
చాలుకొని చిన్ననాఁడు సాముసేసినదియెల్లా
పాలుమలకుండా నేఁడు ఫలిఁచెను
(॥వేవే॥)
ధీరుఁడ వౌదువు నీవు తెరవలాడే వెంగేల
మారుమాటలకెల్లా నీమన సోర్చును
దూరుగాఁగ శిశుపాలు తుచ్చపుమాటలచేత
వారివీరిలోన నలవవాటుసేసుకొంటివి
(॥వేవే॥)
బలువుండ వౌదువు భామలచన్నులు మోవ
పలుమారు నీజవ్వనపాయ మోర్చును
అలమేల్మంగ నేలితి వందుకే శ్రీవేంకటేశ
తలఁప గోవర్ధనమందరము లెత్తితివి
(||pallavi||)
vevelagu māgu nim̐ka vĕṟavam̐gam̐ baniledu
sevalu ne memainām̐ jedumu nīgim̐kanu
(||veve||)
tālimigalavām̐ḍavu taruṇulĕllā nāḍeḍi
melamulagĕllā nīme norusunu
sālugŏni sinnanām̐ḍu sāmusesinadiyĕllā
pālumalaguṁḍā nem̐ḍu phalim̐sĕnu
(||veve||)
dhīrum̐ḍa vauduvu nīvu tĕravalāḍe vĕṁgela
mārumāḍalagĕllā nīmana sorsunu
dūrugām̐ga śhiśhubālu tuchchabumāḍalaseda
vārivīrilona nalavavāḍusesugŏṁṭivi
(||veve||)
baluvuṁḍa vauduvu bhāmalasannulu mova
palumāru nījavvanabāya morsunu
alamelmaṁga nelidi vaṁduge śhrīveṁkaḍeśha
talam̐pa govardhanamaṁdaramu lĕttidivi