Vevegam briyaalu seppi vemdugoneem gaaga nannu

వేవేగఁ బ్రియాలు చెప్పి వేఁడుకొనీఁ గాక నన్ను
Language

(॥పల్లవి॥)
వేవేగఁ బ్రియాలు చెప్పి వేఁడుకొనీఁ గాక నన్ను
చేవమీరి విన్నపాలు సేసేనా నేను

(॥॥)
చెక్కులే నొక్కితిఁ గాని చేతిగోర నూఁదనైతి
మొక్కితిఁగాని కాఁకల మొరయనైతి
నిక్కి చూచితిఁ గాని నెరుసు వెదకనైతి
చికిం(క్కిం)చుక విన్నపాలు సేసేనా నేను

(॥॥)
విరులవేసితిఁ గాని వెట్టగాఁ జెనకనైతి
సరుగ నవ్వితిగాని జంకించనైతి
తిరి గిచూచితిఁగాని దీకొని మాటాడనైతి
సిరిమించి విన్నపాలు సేసేనా నేను

(॥॥)
అలమితిఁగాని నే నదలించి దూరనైతి
పిలిచితిఁ గానీ మరి బిగియనైతి
యెలమి శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
చెలఁరేగి విన్నపాలు సేసేనా నేను

(||pallavi||)
vevegam̐ briyālu sĕppi vem̐ḍugŏnīm̐ gāga nannu
sevamīri vinnabālu sesenā nenu

(||||)
sĕkkule nŏkkidim̐ gāni sedigora nūm̐danaidi
mŏkkidim̐gāni kām̐kala mŏrayanaidi
nikki sūsidim̐ gāni nĕrusu vĕdaganaidi
sigiṁ(kkiṁ)suga vinnabālu sesenā nenu

(||||)
virulavesidim̐ gāni vĕṭṭagām̐ jĕnaganaidi
saruga navvidigāni jaṁkiṁchanaidi
tiri gisūsidim̐gāni dīgŏni māḍāḍanaidi
sirimiṁchi vinnabālu sesenā nenu

(||||)
alamidim̐gāni ne nadaliṁchi dūranaidi
pilisidim̐ gānī mari bigiyanaidi
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
sĕlam̐regi vinnabālu sesenā nenu