వెట్టిచెలులము నేము వేడుకేకాదా
(॥పల్లవి॥)
వెట్టిచెలులము నేము వేడుకేకాదా
నట్టుకొని నీవింతేసి నవ్వవద్దా నేఁడు
(॥వెట్టి॥)
రాతిరెల్లాఁ బాదాలు రాసి గుద్దించుకొంటివి
నాతోడి పొందు నీకు నయమేకాదా
యేతులకు నాకు మడిచిప్పించుకొంటి విందాఁకా
లాతుగా నిది గొంతలాభమేకాదా
(॥వెట్టి॥)
కొంగుపట్టు కిందాఁకా కొప్పు దూవించుకొంటివి
చెంగట నీగజరుకు సెలవేకాదా
వుంగరాలవే ళ్లిందాఁకా వూరకే పిసికించితి
వెంగలిమావూడిగాలు వినోదాలుగావా
(॥వెట్టి॥)
కూరిమి గొసరుకొంటా కుంచవేయించుకొంటివి
సారెకుఁ గరఁగ నీకు చవులేకావా
ఆరయ శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
దారకుఁడ వింతసేయఁ దగవే కాదా
(||pallavi||)
vĕṭṭisĕlulamu nemu veḍugegādā
naṭṭugŏni nīviṁtesi navvavaddā nem̐ḍu
(||vĕṭṭi||)
rādirĕllām̐ bādālu rāsi guddiṁchugŏṁṭivi
nādoḍi pŏṁdu nīgu nayamegādā
yedulagu nāgu maḍisippiṁchugŏṁṭi viṁdām̐kā
lādugā nidi gŏṁtalābhamegādā
(||vĕṭṭi||)
kŏṁgubaṭṭu kiṁdām̐kā kŏppu dūviṁchugŏṁṭivi
sĕṁgaḍa nīgajarugu sĕlavegādā
vuṁgarālave ḽliṁdām̐kā vūrage pisigiṁchidi
vĕṁgalimāvūḍigālu vinodālugāvā
(||vĕṭṭi||)
kūrimi gŏsarugŏṁṭā kuṁchaveyiṁchugŏṁṭivi
sārĕgum̐ garam̐ga nīgu savulegāvā
āraya śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
dāragum̐ḍa viṁtaseyam̐ dagave kādā