Vetti valabusallagu vishnumooridi naado

వెట్టి వలపుచల్లకు విష్ణుమూరితి నాతో
Language

(॥పల్లవి॥)
వెట్టి వలపుచల్లకు విష్ణుమూరితి నాతో
వెట్టి దేర మాటాడు విష్ణుమూరితి

(॥వెట్టి॥)
వినయము నేసేవు విష్ణుమూరితిఁ నీవు
వెనకటివాఁడవే కా విష్ణుమూరితి
వినవయ్య మామాఁట విష్ణుమూరతి మమ్ము
వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి

(॥వెట్టి॥)
వెరవు గలవాఁడవు విష్ణుమూరితి నేఁడు
వెరగైతి నిన్నుఁ జూచి విష్ణుమూరితి
విరివాయ నీ మాయలు విష్ణుమూరితి నాకు
విరు లిచ్చేవప్పటిని విష్ణుమూరితి

(॥వెట్టి॥)
వెలసె నీ సేఁతలెల్లా విష్ణుమూరితి మా
వెలువలలోన నివె విష్ణుమూరితి
వెలలేని శ్రీ వేంకట విష్ణుమూరితి కూడి
విలసిల్లితివి నాతో విష్ణు మూరితి

(||pallavi||)
vĕṭṭi valabusallagu viṣhṇumūridi nādo
vĕṭṭi dera māḍāḍu viṣhṇumūridi

(||vĕṭṭi||)
vinayamu nesevu viṣhṇumūridim̐ nīvu
vĕnagaḍivām̐ḍave kā viṣhṇumūridi
vinavayya māmām̐ṭa viṣhṇumūradi mammu
vĕnugŏni paṭṭagumī viṣhṇumūridi

(||vĕṭṭi||)
vĕravu galavām̐ḍavu viṣhṇumūridi nem̐ḍu
vĕragaidi ninnum̐ jūsi viṣhṇumūridi
virivāya nī māyalu viṣhṇumūridi nāgu
viru lichchevappaḍini viṣhṇumūridi

(||vĕṭṭi||)
vĕlasĕ nī sem̐talĕllā viṣhṇumūridi mā
vĕluvalalona nivĕ viṣhṇumūridi
vĕlaleni śhrī veṁkaḍa viṣhṇumūridi kūḍi
vilasillidivi nādo viṣhṇu mūridi