వెఱ్ఱితనమున నిన్ను వేసరించేఁగాక నీవు
(॥పల్లవి॥)
వెఱ్ఱితనమున నిన్ను వేసరించేఁగాక నీవు
వొఱ్ఱెబాగుల వాఁడవు వొద్దికయ్యేనా
(॥॥)
కాముకుఁడైన వానికి కడుఁ బరాకే ఘనము
వేమారు మా విన్నపము వీనులంటీనా
ఆమీద వీడెము సేసేయప్పుడు మదమెక్కుడు
చేముట్టి నేఁ దీసితేను చేరవచ్చేవా
(॥॥)
కన్నెపాయపు వానికి గబ్బితనమే ఘనము
పన్ని నే మాటాడించితేఁ బలికేవా
వన్నెల నందుకుఁ దోడు వనితలలో నున్నాఁడ-
వెన్ని మొక్కులు మొక్కినా నెరఁగ వచ్చీనా
(॥॥)
దొరతనపువానికి దొట్టి వుండు గర్వమెల్ల
గరిమ నేఁ జెనకితేఁ గైకొనేవా
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
సిరులఁ బెండ్లాడితివి సిగ్గువడేవా
(||pallavi||)
vĕṭridanamuna ninnu vesariṁchem̐gāga nīvu
vŏṭrĕbāgula vām̐ḍavu vŏddigayyenā
(||||)
kāmugum̐ḍaina vānigi kaḍum̐ barāge ghanamu
vemāru mā vinnabamu vīnulaṁṭīnā
āmīda vīḍĕmu seseyappuḍu madamĕkkuḍu
semuṭṭi nem̐ dīsidenu seravachchevā
(||||)
kannĕbāyabu vānigi gabbidaname ghanamu
panni ne māḍāḍiṁchidem̐ baligevā
vannĕla naṁdugum̐ doḍu vanidalalo nunnām̐ḍa-
vĕnni mŏkkulu mŏkkinā nĕram̐ga vachchīnā
(||||)
dŏradanabuvānigi dŏṭṭi vuṁḍu garvamĕlla
garima nem̐ jĕnagidem̐ gaigŏnevā
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
sirulam̐ bĕṁḍlāḍidivi sigguvaḍevā