వేసరింతురా చెలిని విట్ఠలేశ్వరా
(॥పల్లవి॥)
వేసరింతురా చెలిని విట్ఠలేశ్వరా
నీ సుద్దుల కోపునా నేఁడు విట్ఠలేశ్వరా
(॥॥)
కామిని నీతో నవ్వదా కపటమించుకా లేక
వేమారు నిందాఁకాను విట్ఠలేశ్వరా
గోముననుండి యలసి కోరి తెరవేసుకొంటే
గామిడిసేఁత సేసేవు కడు విట్ఠలేశ్వరా
(॥॥)
వీడు జోడై చెనకదా విరసాలు నెరపక
వీడెము చేతికొసఁగి విట్ఠలేశ్వరా
వూడిగేలు చేసి వోవరిలో నుండితేను
ఆడుకొనే వెంతగబ్బియని విట్ఠలేశ్వరా
(॥॥)
చెంత నిన్నిట్టే కూడదా శ్రీవేంకటాద్రిమీద
వింతలేని చనవుతో విట్ఠలేశ్వరా
బంతిరతులను జొక్కి పచ్చడము చొచ్చుకొంటే
పంతాన మరిఁ గూడేవు బాపు విట్ఠలేశ్వరా
(||pallavi||)
vesariṁturā sĕlini viṭṭhaleśhvarā
nī suddula kobunā nem̐ḍu viṭṭhaleśhvarā
(||||)
kāmini nīdo navvadā kabaḍamiṁchugā lega
vemāru niṁdām̐kānu viṭṭhaleśhvarā
gomunanuṁḍi yalasi kori tĕravesugŏṁṭe
gāmiḍisem̐ta sesevu kaḍu viṭṭhaleśhvarā
(||||)
vīḍu joḍai sĕnagadā virasālu nĕrabaga
vīḍĕmu sedigŏsam̐gi viṭṭhaleśhvarā
vūḍigelu sesi vovarilo nuṁḍidenu
āḍugŏne vĕṁtagabbiyani viṭṭhaleśhvarā
(||||)
sĕṁta ninniṭṭe kūḍadā śhrīveṁkaḍādrimīda
viṁtaleni sanavudo viṭṭhaleśhvarā
baṁtiradulanu jŏkki pachchaḍamu sŏchchugŏṁṭe
paṁtāna marim̐ gūḍevu bābu viṭṭhaleśhvarā