Vesarimchedaanam gaanu veginamtaa ninnunu

వేసరించేదానఁ గాను వేగినంతా నిన్నును
Language

(॥పల్లవి॥)
వేసరించేదానఁ గాను వేగినంతా నిన్నును
రాసి కెక్క నీకృప నే రతిఁ జెలఁగుదును

(॥॥)
నట్ట నడుమనే నీవు నావాఁడవై వుంటేఁ జాలు
అట్టే నే నెంతటిదాన నైనా నౌదును
గుట్టు తోడ నీవు నాకుఁగొలు విచ్చితేఁ జాలు
నెట్టన లోకమునకు నేనే రాజ నౌదును

(॥॥)
కందువ నీవు నన్నుఁ గన్నులఁ జూచితేఁ జాలు
అందపు సిరుల నోలలాడుదును
మందలించి నాతో నొక మాటాడితేనే చాలు
పందెమాడి నీచే తుది పదము చేకొందును

(॥॥)
చేరి శ్రీ వేంకటేశ్వర సెలవి నవ్వితేఁ జాలు
కోరి నీవలపులకు గురి యౌదును
సారె నలమేల్మంగను సతి నీకు నైతేఁ జాలు
మేరతోఁ గూడితిని మేలెల్లా సాదింతునూ

(||pallavi||)
vesariṁchedānam̐ gānu veginaṁtā ninnunu
rāsi kĕkka nīkṛpa ne radim̐ jĕlam̐gudunu

(||||)
naṭṭa naḍumane nīvu nāvām̐ḍavai vuṁṭem̐ jālu
aṭṭe ne nĕṁtaḍidāna nainā naudunu
guṭṭu toḍa nīvu nāgum̐gŏlu vichchidem̐ jālu
nĕṭṭana logamunagu nene rāja naudunu

(||||)
kaṁduva nīvu nannum̐ gannulam̐ jūsidem̐ jālu
aṁdabu sirula nolalāḍudunu
maṁdaliṁchi nādo nŏga māḍāḍidene sālu
paṁdĕmāḍi nīse tudi padamu segŏṁdunu

(||||)
seri śhrī veṁkaḍeśhvara sĕlavi navvidem̐ jālu
kori nīvalabulagu guri yaudunu
sārĕ nalamelmaṁganu sadi nīgu naidem̐ jālu
meradom̐ gūḍidini melĕllā sādiṁtunū