Vesaridi metla neevemtam dirigi

వేసరితి మెట్ల నీవెంటఁ దిరిగి
Language

(॥పల్లవి॥)
వేసరితి మెట్ల నీవెంటఁ దిరిగి
గాసిఁ బెట్టక మమ్ముఁ గావరాదా

(॥వేస॥)
తీసితివి కోరికల తెగనీక పంచలకు
తోసితివి యింటింటఁ దోయఁదోయ
చేసితివి నీచేఁత చెల్లె నిఁకనైనను
ఆస నీపొందొల్ల మంపరాదా

(॥వేస॥)
కట్టితివి కర్మముల కడదాఁక నాపదలఁ
బెట్టితివి దు:ఖములఁ బెనచిపెనచి
పట్టితివి చలము మము పాయనని యాస నీ-
విట్టైన గొంతసుఖ మియ్యరాదా

(॥వేస॥)
కఱపితివి పాపములే కడఁగి నానావిధుల
నెఱపితివి దుర్దశలే నేర్పుమెరసి
తెఱఁ గొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని-
నెఱిఁగియును నెఱఁగలే మింక నేతెరువో

(||pallavi||)
vesaridi mĕṭla nīvĕṁṭam̐ dirigi
gāsim̐ bĕṭṭaga mammum̐ gāvarādā

(||vesa||)
tīsidivi korigala tĕganīga paṁchalagu
tosidivi yiṁṭiṁṭam̐ doyam̐doya
sesidivi nīsem̐ta sĕllĕ nim̐kanainanu
āsa nībŏṁdŏlla maṁparādā

(||vesa||)
kaṭṭidivi karmamula kaḍadām̐ka nābadalam̐
bĕṭṭidivi du:khamulam̐ bĕnasibĕnasi
paṭṭidivi salamu mamu pāyanani yāsa nī-
viṭṭaina gŏṁtasukha miyyarādā

(||vesa||)
kaṟabidivi pābamule kaḍam̐gi nānāvidhula
nĕṟabidivi durdaśhale nerbumĕrasi
tĕṟam̐ gŏsaṁgiyunu śhrīdiruveṁkaḍeśhvaruni-
nĕṟim̐giyunu nĕṟam̐gale miṁka nedĕruvo