వేసరితి మన్నిటాను వేడుకొనేమిఁక నిన్ను
(॥పల్లవి॥)
వేసరితి మన్నిటాను వేడుకొనేమిఁక నిన్ను
సేస వెట్టి మము దయసేయవయ్య యిఁకను
(॥వే॥)
చలపాదివాఁడవు సాదెనకు లోనుగావు
గెలువ వశమా నిన్నుఁ గెరలి మాకు
మొలకనవ్వులతోనె మొక్కేము పలుమారు
చెలులము మాపై దయసేయవయ్య ఇఁకను
(॥వే॥)
మొక్కలీఁడవెప్పుడును మొనచూపరాదు నీకు
చిక్కించ వశమా నిన్నుఁ జేచేత మాకు
పెక్కువినయములతో ప్రియములు చెప్పేవిట్టె
చెక్కు నొక్కి మాపై దయసేయవయ్య ఇఁకను
(॥వే॥)
శ్రీవేంకటేశుఁడవు చెనకఁగరాదు నేఁడు
సేవించ వశమా నిన్నుఁ జేకొని మాకు
దేవుఁడవు నిన్నే నుతించి కూడితిమిదె
చేవదేర మాపై దయసేయవయ్య ఇఁకను
(||pallavi||)
vesaridi manniḍānu veḍugŏnemim̐ka ninnu
sesa vĕṭṭi mamu dayaseyavayya yim̐kanu
(||ve||)
salabādivām̐ḍavu sādĕnagu lonugāvu
gĕluva vaśhamā ninnum̐ gĕrali māgu
mŏlaganavvuladonĕ mŏkkemu palumāru
sĕlulamu mābai dayaseyavayya im̐kanu
(||ve||)
mŏkkalīm̐ḍavĕppuḍunu mŏnasūbarādu nīgu
sikkiṁcha vaśhamā ninnum̐ jeseda māgu
pĕkkuvinayamulado priyamulu sĕppeviṭṭĕ
sĕkku nŏkki mābai dayaseyavayya im̐kanu
(||ve||)
śhrīveṁkaḍeśhum̐ḍavu sĕnagam̐garādu nem̐ḍu
seviṁcha vaśhamā ninnum̐ jegŏni māgu
devum̐ḍavu ninne nudiṁchi kūḍidimidĕ
sevadera mābai dayaseyavayya im̐kanu