Vesaraga tagiledi vetridaananu

వేసరక తగిలేటి వెఱ్ఱిదానను
Language

(॥పల్లవి॥)
వేసరక తగిలేటి వెఱ్ఱిదానను
ఆసతో నీ(నే?)మన్న నిక నందుఁ గాని

(॥వేరక॥)
చలివేడి మాటలూ సరసపు తేటలూ
కలకాలము నీయందు గన్నవే కావా
పిలువని పేరటాలు పెన్నగొన్న మోహలు
నలువంక నేనే నీపై నడుపే గాని

(॥వేరక॥)
బచ్చెన చూపుల పైపైఁ దరి తీపుల
గచ్చుల నీయం దెపుడు గలవే కావా
ముచ్చటలవిన్నపాలు మొక్కేటి వినయములు
పెచ్చురేగి నే నీతో బెనఁగేగాక

(॥వేరక॥)
నాలి తొడి పంతనాలు ననుపు పొంతనాలు
చాలినంతా నాకు గల సాజమే కాదా
కోలుముందై నేనే నిన్ను గూడితి శ్రీ వేంకటేశ
మేలు మేలనుచు నిట్టే మేచ్చేగాని

(||pallavi||)
vesaraga tagileḍi vĕṭridānanu
āsado nī(ne?)manna niga naṁdum̐ gāni

(||veraga||)
saliveḍi māḍalū sarasabu teḍalū
kalagālamu nīyaṁdu gannave kāvā
piluvani peraḍālu pĕnnagŏnna mohalu
naluvaṁka nene nībai naḍube gāni

(||veraga||)
bachchĕna sūbula paibaim̐ dari tībula
gachchula nīyaṁ dĕbuḍu galave kāvā
muchchaḍalavinnabālu mŏkkeḍi vinayamulu
pĕchchuregi ne nīdo bĕnam̐gegāga

(||veraga||)
nāli tŏḍi paṁtanālu nanubu pŏṁtanālu
sālinaṁtā nāgu gala sājame kādā
kolumuṁdai nene ninnu gūḍidi śhrī veṁkaḍeśha
melu melanusu niṭṭe mechchegāni