వేసరక సారె నన్ను వేఁడుకొనే విందరిలో
(॥పల్లవి॥)
వేసరక సారె నన్ను వేఁడుకొనే విందరిలో
ఆసతోడ నేమి సేయుమనేవయ్యా యిపుడు
(॥॥)
వెగ్గళించక నీచేత విడె మందుకొంటి నిట్టె
సిగ్గువడకుమనవే చెప్పితి నేను
కగ్గులేక యప్పటిని కాఁపురములు సేసితి-
నగ్గమైతి నేమి సేయుమనేవయ్యా యిపుడు
(॥॥)
పంతములాడక నీపనులెల్లాఁ జేసితి
వంతులువెట్టక నేనే వలచితిని
వింతలు సేయక మోవివిందులు చవిగొంటివి
అంతరంగ మేమి సేయమనేవయ్యా యిపుడు
(॥॥)
వేసాలు చెప్పక నిన్ను విచ్చనవిడిఁ గూడితి
బాసగొనక దేవినై పట్టమేలితి
నీసరి శ్రీ వేంకటేశ నే నల మేలుమంగను
ఆసుద్దుల కేమి సేయుమనేవయ్యా యిపుడు
(||pallavi||)
vesaraga sārĕ nannu vem̐ḍugŏne viṁdarilo
āsadoḍa nemi seyumanevayyā yibuḍu
(||||)
vĕggaḽiṁchaga nīseda viḍĕ maṁdugŏṁṭi niṭṭĕ
sigguvaḍagumanave sĕppidi nenu
kaggulega yappaḍini kām̐puramulu sesidi-
naggamaidi nemi seyumanevayyā yibuḍu
(||||)
paṁtamulāḍaga nībanulĕllām̐ jesidi
vaṁtuluvĕṭṭaga nene valasidini
viṁtalu seyaga moviviṁdulu savigŏṁṭivi
aṁtaraṁga memi seyamanevayyā yibuḍu
(||||)
vesālu sĕppaga ninnu vichchanaviḍim̐ gūḍidi
bāsagŏnaga devinai paṭṭamelidi
nīsari śhrī veṁkaḍeśha ne nala melumaṁganu
āsuddula kemi seyumanevayyā yibuḍu