వెసఁ గాఁపురము సేయ విచ్చనలి(వి?)డి
(॥పల్లవి॥)
వెసఁ గాఁపురము సేయ విచ్చనలి(వి?)డి
ముసగసలేఁటికి ముదితలతోడను
(॥వెసఁ॥)
గరిమ గుఱుతు చెప్పఁగానే చుట్టరికమాయ
తెరమఱఁగుకు రాఁగాతేరె వావి
తరుణికి నీకును తగులు కాముఁడే సేసె
శిరసువంచుక యేల సిగ్గువడేవు
(॥వెసఁ॥)
తప్పకచూడఁగానే దైవారెఁ బొంతనాలు
చిప్పివి విడేలియ్యఁగాఁ జేకూరెఁ బెండి(బెండ్లి?)
కప్పురగందికి నీకుఁ గంతుఁడే వొజ్జలాయ
అప్పటి ఇంకానేలఅనుమానాలయ్యా
(॥వెసఁ॥)
పానుపుపైఁ బండఁగానే పలియించె సంసారము
నానె శ్రీవేంకటేశ నీనవ్వులమోవి
మానవతికిని నీకు మరుఁడే సేస లందిచ్చె
పూనిపట్టి మరియేల బోదించ నిపుడు
(||pallavi||)
vĕsam̐ gām̐puramu seya vichchanali(vi?)ḍi
musagasalem̐ṭigi mudidaladoḍanu
(||vĕsam̐||)
garima guṟudu sĕppam̐gāne suṭṭarigamāya
tĕramaṟam̐gugu rām̐gāderĕ vāvi
taruṇigi nīgunu tagulu kāmum̐ḍe sesĕ
śhirasuvaṁchuga yela sigguvaḍevu
(||vĕsam̐||)
tappagasūḍam̐gāne daivārĕm̐ bŏṁtanālu
sippivi viḍeliyyam̐gām̐ jegūrĕm̐ bĕṁḍi(bĕṁḍli?)
kappuragaṁdigi nīgum̐ gaṁtum̐ḍe vŏjjalāya
appaḍi iṁkānelaanumānālayyā
(||vĕsam̐||)
pānububaim̐ baṁḍam̐gāne paliyiṁchĕ saṁsāramu
nānĕ śhrīveṁkaḍeśha nīnavvulamovi
mānavadigini nīgu marum̐ḍe sesa laṁdichchĕ
pūnibaṭṭi mariyela bodiṁcha nibuḍu